క్రైమ్/లీగల్

ఛత్తీస్‌గఢ్‌లో ఎదురుకాల్పులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బీజాపూర్, జూన్ 28: చత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్ జిల్లాలో శుక్రవారం నక్సలైట్లతో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు సీఆర్‌పీఎఫ్ సిబ్బంది మృతి చెందారు. భద్రతా దళాలకు, నక్సలైట్లకు మధ్య జరిగిన ఈ ఎన్‌కౌంటర్‌లో చిక్కుకొని ఒక బాలిక కూడా మృతి చెందింది. సీఆర్‌పీఎఫ్‌కు చెందిన 199వ బెటాలియన్, రాష్ట్ర పోలీసులతో కూడిన ఒక టీమ్ మోటార్‌సైకిళ్లపై గస్తీ తిరుగుతుండగా కేశ్‌కుటుల్ గ్రామ సమీపంలోని ఒక కల్వర్టు వద్ద ఉదయం 11 గంటలకు ఈ ఎన్‌కౌంటర్ జరిగిందని బీజాపూర్ జిల్లా పోలీసు సూపరింటెండెంట్ (ఎస్‌పీ) దివ్యాంగ్ పటేల్ తెలిపారు. ఇద్దరు బాలికలు ఈ ఎన్‌కౌంటర్‌లో చిక్కుకోగా, అందులో ఒకామె చనిపోయిందని, మరొకామె గాయపడి, ఆసుపత్రిలో చికిత్స పొందుతోందని
ఆయన వివరించారు. పెట్రోలింగ్ టీమ్ మోటార్ సైకిళ్లపై బైరామ్‌గఢ్ పోలీస్ స్టేషన్ పరిధిలో గల కేశ్‌కుటుల్ గ్రామంలో ఉన్న తమ క్యాంపు నుంచి బైరామ్‌గఢ్ వైపు వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. భద్రతా దళాలు కేశ్‌కుటుల్ గ్రామం మీదుగా ముందుకు సాగుతుండగా, కొంతమంది సాయుధ నక్సలైట్లు కాపు కాసి, కాల్పులకు తెగబడ్డారని, దీంతో పెట్రోలింగ్ టీమ్ ఎదురుకాల్పులు జరిపిందని పటేల్ వివరించారు. నక్సలైట్లు జరిపిన కాల్పుల్లో ఇద్దరు సీఆర్‌పీఎఫ్ సిబ్బంది సంఘటన స్థలంలోనే మృతి చెందగా, మరొకరు తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. మృతి చెందిన సీఆర్‌పీఎఫ్ సిబ్బందిని సబ్ ఇన్‌స్పెక్టర్లు మహదేవ పి (50), మదన్ పాల్ సింగ్ (52), హెడ్ కానిస్టేబుల్ సాజు ఓపీ (47)లుగా గుర్తించినట్టు అధికారులు తెలిపారు. మహదేవ సొంతూరు కర్ణాటకలోని గుల్బర్గా కాగా సింగ్ ఉత్తర్‌ప్రదేశ్‌లోని అలీగఢ్‌కు చెందిన వ్యక్తి. సాజు కేరళలోని ఇడుక్కికి చెందిన వ్యక్తి అని అధికారులు చెప్పారు. ఎన్‌కౌంటర్ స్థలం మీదుగా వెళ్తున్న ఒక సరుకు రవాణా వాహనంలో ఉన్న ఇద్దరు బాలికలు క్రాస్‌ఫైర్‌లో చిక్కుకున్నారని ఎస్‌పీ తెలిపారు. ఈ ఇద్దరిలో ఒకరు మృతి చెందగా, మరొకరు గాయపడ్డారని ఆయన వివరించారు. ఎన్‌కౌంటర్ స్థలానికి అదనపు భద్రతా బలగాలను తరలించడం జరిగిందని, గాయపడిన వారిని బైరామ్‌గఢ్‌లో గల ఒక ఆసుపత్రిలో చేర్పించడం జరిగిందని ఆయన తెలిపారు. ఎన్‌కౌంటర్ జరిగిన స్థలంలో గాలించగా, రెండు శక్తివంతమయిన పేలుడు పరికరాలు (ఐఈడీలు) లభించాయని పటేల్ తెలిపారు. ఈ ఎన్‌కౌంటర్ సందర్భంగా నక్సలైట్లు భద్రతా బలగాలకు చెందిన ఒక ఏకే-47 రైఫిల్‌ను, దాని నాలుగు మాగజైన్లను, ఒక బుల్లెట్‌ప్రూఫ్ జాకెట్‌ను, ఒక వైర్‌లెస్ సెట్‌ను ఎత్తుకెళ్లారని మరో పోలీసు అధికారి తెలిపారు.