క్రైమ్/లీగల్

రెండు వేల కరెన్సీ నోట్లను రెట్టింపు చేస్తామంటూ మోసం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చౌటుప్పల్, జూన్ 28: ఒక రెండు వేల నోటును రెండు నోట్లుగా చేస్తామని నమ్మించి ఒక వ్యక్తిని మోసం చేసి 12 లక్షల నగదును కాజేసి ఉడాయించిన ఘరానా మోసగాడిని యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ పోలీసులు పట్టుకున్నారు. ఘరానా ముఠా సభ్యుడు షేక్ సైదా (33)ను శుక్రవారం రాత్రి వలిగొండ క్రాస్ రోడ్డు వద్ద అరెస్ట్ చేసారు. అతని నుంచి 12 లక్షల నగదు, ఒక్క నోటుకు రెండు నోట్లు తయారు చేసామని నమ్మించి నల్ల కవర్‌లో పెట్టిన కాగితాలను స్వాధీనం చేసుకొని కోర్టులో డిపాజిట్ చేసారు. శుక్రవారం ఏసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో సంఘటనకు సంబంధించిన వివరాలను డీసీపీ కె.నారాయణరెడ్డి తెలియజేశారు. గుంటూరు జిల్లా మాచవరం మండలం తుర్కపాలెంలో నివాసం ఉంటున్న సూర్యాపేట జిల్లా నాగారం మండలం శాంతినగర్‌కు చెందిన షేక్ సైదా గతంలో ఖైతాపురం గ్రామానికి వలస వచ్చి రాళ్లు కొట్టి జీవనం సాగించాడు. సులువుగా డబ్బులు సంపాదించాలన్న ఆలోచనతో షేక్ బాషా, షేక్ చిన్నవలితో జతకట్టాడు. ముగ్గురూ ముఠాగా ఏర్పడ్డారు. రెండు వేల నోటు ఇస్తే వాటిని రెట్టింపు చేసి ఇస్తామని నమ్మించి మోసం చేయాలని నిర్ణయించుకున్నారు. కైతాపురంలో పనిచేసే సమయంలో పరిచయం ఏర్పడిన గోపి అయిలయ్యను కలిసి విషయం చెప్పారు. శాంపిల్‌గా రెండు నోట్లు అతని నుంచి తీసుకుని కటింగ్ పేపర్లలో కలిపి గదిలోకి వెళ్లి నాలుగు నోట్లు తీసుకువచ్చి అయిలయ్యకు ఇచ్చారు. అందులో నుంచే ఒక నోటు వారికి ఇనాముగా ఇచ్చి పంపించాడు. తీసుకున్న రెండు వేల నోట్లను చౌటుప్పల్‌లోని బ్యాంకులో వేసారు. దాంతో రెండు వేల నోట్లు మంచివేనని నమ్మాడు. షేక్ సైదా అయిలయ్యతో ఫోన్‌లో మాట్లాడారు. మీరు ఇచ్చిన నోట్లు అసలు నోట్ల మాదిరిగానే ఉన్నాయని చెప్పారు. దీంతో 12 లక్షలు తెస్తే వాటికి రెట్టింపు నోట్లు ఇస్తామని నమ్మించారు. దీంతో అయిలయ్య 12 లక్షలకు సరిపడా రెండు వేల నోట్లను సిద్ధం చేసి పెట్టుకున్నాడు. ఈనెల 21న ముగ్గురు ముఠా సభ్యులు ఇక్కడికి చేరుకున్నారు. అతని నుంచి రూ.12 లక్షలు ఉన్న రెండు వేల నోట్లు తీసుకున్నారు. అతని ఇంట్లోని ఒక గదిలోకి వెళ్లి కటింగ్ పేపర్లతో నోట్లు తయారు చేస్తున్నట్టు నమ్మించారు. కటింగ్ పేపర్లను నల్ల కవర్‌లో చుట్టి కెమికల్ అయిపోయిందని, సగం నోట్లు మాత్రమే తయారు చేసామని, కవర్ వెంటనే తెరవవద్దని నమ్మించారు. మరో రెండు రోజుల్లో అన్నీ సిద్ధం చేసుకుని వస్తామని నమ్మబలికి రూ.12 లక్షలతో ఉడాయించారు. మరుసటి రోజు అనుమానం రావడంతో నల్లకవర్‌లో చుట్టిన ప్యాకెట్లను తీసి చూడగా నల్ల కాగితాలు కన్పించాయి. దీంతో లబోదిబోమంటూ స్థానిక పోలీస్ స్టేషన్‌ను ఆశ్రయించాడు అయిలయ్య. కేసు నమోదు చేసుకున్న పోలీసులు పరిశోధన వేగవంతం చేశారు. గురువారం రాత్రి ముగ్గురిలో ఒకరిని చౌటుప్పల్ పోలీసులు అదుపులోకి తీసుకోని విచారించగా అసలు మోసం బయటపడింది. అతని సమాచారం మేరకు స్వగ్రామానికి వెళ్లి అయిలయ్య నుంచి తస్కరించిన రూ.12లక్షల రెండు వేల నోట్ల నగదును స్వాధీనం చేసుకున్నారు. షేక్ సైదాను కోర్టులో హాజరుపరిచారు.
షేక్ భాషా, షేక్ చిన్నవలీ కోసం గాలిస్తున్నామని డీసీపీ తెలిపారు. ఘరానా మోసగాడిని సకాలంలో అరెస్ట్ చేసిన పోలీసులను అభినందించారు. విలేఖరుల సమావేశంలో ఏసీపీ సత్తయ్య, సీఐ వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.