క్రైమ్/లీగల్

నేలకూలిన శిక్షణ విమానం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ములుగు, జూన్ 28: సిద్దిపేట జిల్లాలో శిక్షణ విమానం నేలకూలిన ప్రమాదంలో ఇద్దరు పైలట్లు గాయపడ్డారు. దీనికి సంబంధించి ములుగు ఎస్‌ఐ రాజేంద్రప్రసాద్ అందించిన వివరాలిలా ఉన్నాయ. మామిడ్యాల నుంచి భవానందాపూర్ దామరకుంట వైపు వెళ్లే రోడ్డులో కొండపోచమ్మ రిజర్వాయర్ పక్కన హైదరాబాద్‌కు చెందిన రాందర్వార్ విమానాల శిక్షణ కోసం చిన్న రన్‌వే ఏర్పాటు చేసుకున్నాడు. ఆయన నెలలో కొన్ని రోజులు ఆ చిన్నపాటి విమానంలో మరో పైలట్‌కు శిక్షణనిస్తూ ఉంటాడు. ఈ సందర్భంలో గురువారం రాత్రి విమానంలో రాందర్వార్, బెంగళూరుకు చెందిన అభిజిత్ అనే పైలట్‌తో కలిసి బయలుదేరగా, కొద్ది క్షణాల్లోనే ఆ విమానంలో సంభవించిన సాంకేతిక సమస్య వల్ల మామిడ్యాల సమీపంలో నేలకూలింది. దీంతో అందులో ప్రయాణిస్తున్న ఇద్దరు పైలట్‌లకు తీవ్ర గాయాలు కాగా, స్థానికులు అందించిన సమాచారం మేరకు ములుగు ఎస్‌ఐ రాజేంద్రప్రసాద్ అక్కడికి చేరుకొని వారిని చికిత్స నిమిత్తం గజ్వేల్ ఆసుపత్రికి తరలించారు. కాగా వారి పరిస్థితి విషమించడంతో హైదరాబాద్‌లోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు.