క్రైమ్/లీగల్

మరోసారి హైకోర్టులో రవిప్రకాశ్ పిటిషన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 28: టీవీ-9 మాజీ సీఈఓ రవిప్రకాశ్ మరోమారు తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. తెలంగాణ పోలీసులు ఫోర్జరీ, మోసం అభియోగాలతో తనపై నమోదు చేసిన మూడు కేసులను కొట్టివేయాలని ఆయన కోర్టును కోరారు. దురుద్దేశంతోనే తనపై ఈ మూడు కేసులు పెట్టారని అన్నారు. ఈమేరకు తనపై నమోదైన మూడు కేసులకు గానూ మూడు అఫిడవిట్లను ఆయన దాఖలు చేశారు. ఇందులో ప్రతివాదులుగా తెలంగాణ ప్రభుత్వాన్ని, అలందా మీడియాను కూడా చేర్చారు. హర్యానా వెర్సస్ భజన్‌లాల్ కేసులో సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు విరుద్ధంగా పోలీసులు తనపై కేసులు పెట్టారని రవిప్రకాశ్ పేర్కొన్నారు. ఇందుకు ఎలాంటి ఆధారాలను అధికారులు చూపడం లేదని అన్నారు. అంతేగాక, తాను పాతతేదీతో షేర్లను విక్రయించినట్టు తప్పుడు పత్రాలను సృష్టించానని మోపిన అభియోగంలో ఎంత మాత్రం వాస్తవం లేదని అన్నారు. అవాస్తవాలు, ఊహాజనిత ఆరోపణలతో పెట్టిన ఈ కేసులను కొట్టివేయాలని ధర్మాసనాన్ని కోరారు. అలందా మీడియా ఫిర్యాదు నేపథ్యంలో రవిప్రకాశ్‌పై ఫోర్జరీ, కంపెనీ లోగో అమ్మకం, నకిలీ పత్రాల సృష్టి తదితర అభియోగాల కింద పోలీసులు కేసులు నమోదుచేశారు. అప్పట్లో బెయిల్ కోసం రవిప్రకాశ్ హైకోర్టును ఆశ్రయించగా, కోర్టు నిరాకరించింది. దీంతో కేసులను కొట్టివేయాలని కోరుతూ రవిప్రకాశ్ సుప్రీంకోర్టు మెట్లు ఎక్కారు. విషయాన్ని హైకోర్టులోనే తేల్చుకోవాలని అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేయడంతో రవిప్రకాశ్ పోలీసుల ముందు హాజరయ్యారు.