క్రైమ్/లీగల్

‘కొత్త సచివాలయం’పై హైకోర్టులో విచారణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 28: తెలంగాణ సచివాలయం కూల్చివేసి కొత్త భవనాలను నిర్మించాలన్న టీఆర్‌ఎస్ సర్కార్ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ కాంగ్రెస్ ఎంపీ రేవంత్‌రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. రేవంత్‌రెడ్డి పిటీషన్‌పై శుక్రవారం విచారణ జరిగింది. ఈ సందర్భంగా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రాఘవేంద్ర సింగ్ చౌహాన్ నేతృత్వంలోని బెంచ్ ప్రభుత్వ అధికారులను పలు వివరణలు కోరారు. ఆ సమాచారంతో హైకోర్టులో కౌంటర్ దాఖలు చేయాల్సిందిగా ఆదేశిస్తూ తదుపరి విచారణను జూలై 8వ తేదీకి వాయిదా వేసింది. నూతన సచివాలయం నిర్మాణానికి సంబంధించిన ప్లాన్లు, ఇతర వివరాలు కూడా తమకు సమర్పించాలని అదనపు ఏజీని ఆదేశించింది. ఉన్న నిర్మాణాలను వదిలేసి కొత్తవి కట్టాల్సిన అవసరం ఏం వచ్చిందని కోర్టు వ్యాఖ్యానించింది. ఎర్రమంజిల్ భవనం హెరిటేజ్ భవనం దానిని కూల్చడానికి కారణాలు ఏమిటి అని న్యాయస్థానం ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. ఎర్రమంజిల్ భవనం చారిత్రాత్మక కట్టడాల జాబితాలోకి రాదని అదనపు ఏజీ వాదనలు వినిపించారు. ఃకాంగ్రెస్ నేత జీవన్‌రెడ్డి 2016లో దాఖలు చేసిన పిటీషన్‌పై కూడా ఇపుడు విచారణ జరపలేమని, దీనిపై తెలంగాణ ప్రభుత్వం అఫిడవిట్ దాఖలు చేసిందని హైకోర్టు పేర్కొంది. జీవన్‌రెడ్డి పిటిషన్‌పై ఆగస్టు చివరివారంలో విచారణ చేపడతామని పేర్కొంది. సచివాలయం మాత్రమే గాక, అసెంబ్లీ, ఇతర ప్రభుత్వ వ్యవస్థల పాత భవనాల స్థానంలో అన్నీ వాస్తు నియమాలతో కూడిన భవనాలను నిర్మించాలని కేసీఆర్ భావిస్తున్నారని , ఈ క్రమంలో 400 కోట్ల రూపాయిలతో కొత్త సచివాలయం నిర్మించాలని నిర్ణయించారని ఇది ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయడమేనని రేవంత్‌రెడ్డి తన పిటీషన్‌లో పేర్కొన్నారు. ప్రస్తుతం ఉన్న భవనాలు మరో 50-70 ఏళ్లు సురక్షితమని, వాటిని కూలదోసి కొత్తవి కట్టడం ఏమిటని పిటిషనర్ ప్రశ్నించారు. ఎర్రమంజిల్ భవనం కూల్చివేత సరికాదని, నూతన శాసనసభ నిర్మాణంతో ఆ ప్రాంతంలో ట్రాఫిక్ సమస్యలు తలెత్తుతాయని పిటిషనర్ వాదించారు.