క్రైమ్/లీగల్

కొత్తగూడెం ఎమ్మెల్యే వనమాపై కేసు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కొత్తగూడెం, జూలై 1: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లక్ష్మీదేవిపల్లి మండలంలోని లోతువాగు సమీపంలో ఫారెస్ట్ అధికారుల విధులకు ఆటంకం కల్పించారనే ఫిర్యాదు మేరకు కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావుపై కేసు నమోదు చేశారు. చాతకొండ డెప్యూటీ రేంజ్ అధికారి ఎంఆర్‌పీ రావు ఫిర్యాదు మేరకు ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావుతో పాటు నలుగురిపై కేసు నమోదు చేసినట్లు లక్ష్మీదేవిపల్లి ఎస్‌ఐ నరేష్ తెలిపారు. లోతువాగు సమీపంలోని అటవీ భూముల్లో కందకాలు తవ్వితే వాటిని పూడ్చివేసిన సంఘటనలో ఎమ్మెల్యే వనమాతో పాటు, ఆయన తనయుడు రాఘవేంద్రరావు, మాజీ ఎంపిటిసి సభ్యులు పూనెం శ్రీనివాస్, భూక్య లింగ్య, ఖానాబుద్దీన్‌లపై పలు సెక్షన్‌లపై కేసులు నమోదు చేసిన్నట్లు తెలిపారు.