క్రైమ్/లీగల్

అత్తింటి వేధింపులతో యువతి ఆత్మహత్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఉప్పల్, జూలై 1: అత్తింటి వేధింపులకు ఓ యువతి ఆత్మహత్య చేసుకున్న సంఘటన మేడిపల్లి పోలీసు స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం- చెంగిచర్ల ఇందిరానగర్‌లో నివసిస్తున్న ఏ.రాజు భార్య వీరమణి (28) గృహిణి. తొమ్మిదేళ్ల క్రితం వీరి వివాహం జరిగింది. ప్రస్తుతం వీరికి ముగ్గురు పిల్లలు. నిత్యం అత్త వేధింపులతో ఇటీవలనే వేరు కాపురం పెట్టారు. అయినప్పటికీ వేధిస్తుండటంతో భరించలేక కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుంది. తీవ్రంగా గాయపడిన ఆమెను గాంధీ ఆసుపత్రిలో చేర్పించగా చికిత్స పొందుతూ ఆదివారం మరణించందని పోలీసులు తెలిపారు.