క్రైమ్/లీగల్

రూ.2వేలు ఫైన్ కట్టండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 10: అనకాపల్లి చక్కెర ఫ్యాక్టరీ గ్రాట్యుటీ కేసుకు సంబంధించి కోర్టుకుహాజరు కావాలన్న తమ ఆదేశాలను పాటించనందుకు విశాఖపట్నం జిల్లా జాయింట్ కలెక్టర్‌కు రూ.2వేల ఫైన్ విధిస్తూ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. అనంతరం జిల్లా అధికారులు ఈ జరిమానాను చెల్లించారు. అనకాపల్లి చక్కెర ఫ్యాక్టరీ ఉద్యోగుల గ్రాట్యుటీ బకాయిలు చెల్లింపునకు సంబంధించిన అంశంపై ఆరువారాల గడువు కావాలని అధికారులు హైకోర్టును కోరారు. కాగా ఈ కేసుపై వచ్చే వారం స్పష్టతతో కోర్టుకు రావాలని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ పి నవీన్ రావు ఆదేశించారు. అనకాపల్లి వివి రమణ సహకార చక్కెర ఫ్యాక్టరీ 2010లో మూతపడితే, ఇంతవరకు రెండు వందల మంది ఉద్యోగులకు గ్రాట్యుటీ బకాయిలు చెల్లించకపోవడంపై హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. ఈ కేసులో దాడి సూర్యప్రకాశరావు మరో 59 మంది ఉద్యోగులు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసును విచారించినకోర్టు గత ఏడాది ఈ కేసులో రిటైర్డయిన ఉద్యోగులకు గ్రాట్యూటీ బకాయిలు వెంటనే చెల్లించేందుకు చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. కాని ఈ ఆదేశాలను ప్రభుత్వాధికారులు అమలు చేయడంలో విఫలం కావడంతో, హైకోర్టులో కోర్కు ధిక్కారం కేసు రిటైర్డు ఉద్యోగులు పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసును విచారించిన హైకోర్టు ప్రభుత్వాధికారుల తీరుపట్ల అసంతృప్తి వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో ఈ నెల 8వ తేదీన జాయింట్ కలెక్టర్ హైకోర్టుకు హాజరు కావాలని కోర్టు ఆదేశించింది.
కాగా ఇతర కార్యక్రమం ఉన్నందు వల్ల జాయింట్ కలెక్టర్ హాజరు కాలేరని, కోర్టు హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలని అధికారులు కోర్టును కోరారు. కాని ఈ వినతిని కోర్టు తిరస్కరించి జాయింట్ కలెక్టర్‌కు రెండు వేల రూపాయల జరిమానాను విధించింది. ఈ సొమ్మును అధికారులు చెల్లించారు. అనంతరం ఈ సమస్యను పరిష్కరించేందుకు ఆరు వారాల గడువును కోరారు. కాని హైకోర్టు వచ్చే వారానికి కేసు వాయిదా వేసింది. అదికారులు కార్యాచరణ ప్రణాళికతో ముందుకు రావాలని కోర్టు ఆదేశించింది.