క్రైమ్/లీగల్

మాయిస్టుల పేరుతో బెదిరింపులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అశ్వాపురం, ఏప్రిల్ 2: కాంట్రాక్టర్లు, వ్యాపారులను మావోయిస్టుల పేరుతో బెదిరిస్తూ డబ్బులు డిమాండ్ చేస్తున్న నలుగురు నకిలీ మావోయిస్టులను సోమవారం అశ్వాపురంలో పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు పంపినట్లు మణుగూరు డీఎస్పీ ఆర్.సాయిబాబా వెల్లడించారు. సోమవారం అశ్వాపురం పోలీసు స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో మణుగూరు డీఎస్పీ సాయిబాబా మాట్లాడారు. భూపాలపల్లి జిల్లా తాడ్వాయి మండలం రెడ్డిగూడెం గ్రామానికి చెందిన ధర్మా సంపత్‌రెడ్డి, గజ్జెల సమ్మయ్య, మంగపేట మండలం కమలాపురం గ్రామానికి చెందిన తలారి సుబ్బారావు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మండలం అశోక్‌నగర్‌కు చెందిన నిమ్మల అశోక్‌శ్రీపతి ఒక ముఠాగా ఏర్పడి మావోయిస్టుల పేరుతో పలువురిని బెదిరిస్తున్నట్లు తమ విచారణలో వెల్లడైందన్నారు. నిందితుల నుంచి రెండు సిమ్ కార్డులు, రెండు సెల్‌ఫోన్లు, మావోయిస్టుల పేరుతో ఉన్న లెటర్ ప్యాడ్లు స్వాధీనం చేసుకున్నామన్నారు. సంపత్‌రెడ్డి, సమ్మయ్య, ఓదేలు అనే ముగ్గురు వెంకటాపురం పెట్రోల్ బంక్ యజమానిని బెదిరించిన కేసులో నిందితులని తెలిపారు. భూపాలపల్లి జిల్లా ఏటూరునాగారం, మంచిర్యాల జిల్లా జైపూర్ పోలీసు స్టేషన్లలో సంపత్‌రెడ్డి పలువురిని బెదిరించిన కేసుల్లో నిందితుడిగా ఉన్నట్లు డీఎస్పీ వివరించారు. సంపత్‌రెడ్డి, గజ్జల సమ్మయ్య, తలారి సుబ్బారావు, అశోక్‌శ్రీపతిని అరెస్టు చేసి కోర్టులో హాజరుపర్చినట్లు తెలిపారు. ఈ సమావేశంలో సీఐ అల్లం నరేందర్ పాల్గొన్నారు.