క్రైమ్/లీగల్

యువకుడి ఆత్మహత్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బాలాపూర్, జూలై 1: రంగారెడ్డి జిల్లా కోర్టులో ఓ న్యాయమూర్తి వద్ద పనిచేసే యువకుడు మనస్తాపంతో ఆత్మహత్య చేసుకున్న సంఘటన సోమవారం మీర్‌పేట్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... జనగాం, కుందవరం గ్రామానికి చెందిన బండి శంకర్ (26) తన అన్నయ్య రాజుతో కలిసి మీర్‌పేట్ సీర్లహిల్స్‌లో నివాసముంటునాడు. శంకర్ (ఔట్‌సోర్సింగ్ ఉద్యోగి) రంగారెడ్డి జిల్లా కోర్టులో ప్రిన్సిపల్ సెషన్స్ జడ్జి వద్ద సహాయకునిగా పనిచేస్తున్నాడు.
పనిలో భాగంగా సదరు జడ్డి.. శంకర్‌పై కోపం చేశాడనే నెపంతో పాటుగా శంకర్‌కు కంట్రాక్టర్ సరిగా జీతం ఇవ్వకపోవడంతో మనస్తాపానికి గురై తాను ఉంటున్న ఇంట్లో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసులు కేసును నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
కోర్టు వద్ద కుటుంబ సభ్యుల ఆందోళన
మృతుడు శంకర్‌కు న్యాయం చేయాలని కోరుతూ సోమవారం సాయంత్రం ఆయన కుటుంబ సభ్యులు రంగారెడ్డి జిల్లా కోర్టు వద్ద ఆందోళనకు దిగారు. సదరు న్యాయమూర్తి శంకర్ స్పందించి బాధిత కుటుంబానికి తగిన న్యాయం జరిగే విధంగా చర్యలు తీసుకుంటామని, శంకర్ కుంటుంబంలోని ఒక సభ్యునికి ఉద్యోగం ఇప్పంచడానికి కృషి చేస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.