క్రైమ్/లీగల్

బైక్ అదుపు తప్పి టూరిస్టు మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వికారాబాద్, జూలై 1: ట్రెక్కింగ్ బైక్ అదుపు తప్పి ఓ టూరిస్టు మృతి చెందిన సంఘటన ధారూరు పోలీస్‌స్టేషన్ పరిధిలో సోమవారం చోటు చేసుకుంది. సీఐ దాసు తెలిపిన వివరాల ప్రకారం యూఎస్‌ఏలో ఉంటున్న సాఫ్టవేర్ ఉద్యోగి అరవింద్(45) కొన్ని రోజుల క్రితమే స్వదేశానికి వచ్చారు. తోటి ఉద్యోగులు, స్నేహితులతోకలిసి అనంతగిరి అటవీ ప్రాంతానికి వచ్చి నాలుగు చక్రాల బైక్‌పై అటవీ ప్రాంతంలో ట్రెక్కింగ్ చేశాడు. కుక్క అడ్డురావడంతో తప్పించే ప్రయత్నంలో బైక్ పైనుంచి కిందపడగా తలకు తీవ్ర గాయమైంది. చికిత్స నిమిత్తం వికారాబాద్ ఆసుపత్రికి తరలించగా అప్పటికే అరవింద్ మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.