క్రైమ్/లీగల్

చంద్రబాబు భద్రతపై అఫిడవిట్ ఇవ్వండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (క్రైం): తనకు భద్రత తగ్గించారంటూ ప్రతిపక్ష నేత, తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు వేసిన పిటిషన్‌పై హైకోర్టులో మంగళవారం వాదనలు జరిగాయి. రాజకీయ కారణాలతో చంద్రబాబుకు భద్రత తగ్గించారని ఆయన తరఫు న్యాయవాది మాజీ అడ్వకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్ వాదించారు. కేవలం రాజకీయ కారణాల వల్లే భద్రత తగ్గించారని ఆరోపిస్తూ హోంశాఖ ముఖ్య కార్యదర్శి, డీజీపీ, గుంటూరు అర్బన్ ఎస్పీ, రాష్ట్ర స్ధాయి భద్రతా సమీక్ష కమిటీలను చంద్రబాబు దాఖలు చేసిన పిటిషన్‌లో ప్రతివాదులుగా పేర్కొన్నారు. ఈ పిటిషన్ మంగళవారం విచారణకు రాగా.. పిటిషనర్ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ చంద్రబాబుతో పాటు ఆయన కుటుంబానికి కూడా భద్రత తగ్గించారని తెలిపారు. వైఎస్ జగన్ ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు కూడా ఆయనకు జెడ్ కేటగిరి సెక్యూరిటీ ఉన్నప్పటికీ 26 మందితో ఆయనకు రాష్ట్ర ప్రభుత్వం భద్రత కల్పించిందని కోర్టుకు వివరించారు. ప్రభుత్వం తరఫున రాష్ట్ర అడ్వకేట్ జనరల్ సుబ్రహ్మణ్యం శ్రీరామ్ వాదనలు వినిపిస్తూ తామెక్కడా చంద్రబాబుకి భద్రత తగ్గించలేదని కోర్టుకు తెలిపారు. ఇవ్వాల్సిన భద్రత కంటే ఎక్కువే ఇస్తున్నామని, మాజీ ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబుకి 58 మంది భద్రతా సిబ్బందిని మాత్రమే ఇవ్వాల్సి ఉండగా, 74 మందిని ఇచ్చామని కోర్టుకు వివరించారు. వాదనలు విన్న ఉన్నత న్యాయస్ధానం చంద్రబాబుకి ఎంతమందితో, ఎక్కడెక్కడ, ఏయే స్థానాల్లో భద్రత కల్పిస్తున్నారో వివరాలతో అఫిడవిట్ దాఖలు చేయాలని ఆదేశించింది. తదుపరి విచారణను ఈ నెల 9వ తేదీకి వాయిదా వేసింది.