క్రైమ్/లీగల్

ఏసీబీకి చిక్కిన పంచాయతీరాజ్ ఏఈఈ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రొద్దుటూరు, జూలై 2: ఆదాయానికి మించిన ఆస్తులు కూడిబెట్టినట్టు ఆరోపణలు ఎదుర్కొన్న కడప జిల్లా మైలవరం పంచాయతిరాజ్ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ పల్లా సుబ్బయ్యని ఏసీబీ అధికారులు మంగళవారం అరెస్టు చేశారు. కడప జిల్లా ప్రొద్దుటూరు పట్టణంలోని ఆయన ఇంట్లో ఏసీబీ అధికారులు మంగళవారం సోదాలు నిర్వహించి భారీ మొత్తంలో బంగారం, వెండి, నగలు, విలువైన డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ రూ.2 కోట్ల వరకు ఉంటుందని అధికారులు అంచనా వేశారు. పంచాయితీరాజ్ శాఖలో వివిధ మండలాల్లో పనిచేసిన పల్లా సుబ్బయ్య ప్రొద్దుటూరు పట్టణంలోని బుడ్డాయపల్లెలో నివాసముంటున్నారు. ప్రస్తుతం మైలవరంలో ఏఈగా పనిచేస్తున్నారు. ఆదాయానికి మించి ఆస్తులున్నాయన్న ఫిర్యాదు మేరకు కడప ఏసీబీ డీఎస్పీ నాగభూషణం సిబ్బందితో మంగళవారం దాడులు జరిపారు. సుబ్బయ్య ఇంటితో పాటు బంధువుల గృహాల్లో నాలుగుచోట్ల ఏకకాలంలో సోదాలు నిర్వహించారు. ఈ సోదాల్లో 658 గ్రాముల బంగారం, కిలో వెండి స్వాధీనం చేసుకున్నారు.
ఏఈ భార్య పల్లా వీరమ్మ పేర నాలుగు గృహాలు ఉన్నట్లు గుర్తించారు. వాటి విలువ రూ. 32 లక్షలుగా తేల్చారు. అదే విధంగా రూ. 5.80 లక్షల నగదు, పది చోట్ల స్థలాలు ఉన్నట్లు గుర్తించారు. మారుతికారు, మోటార్‌సైకిల్ సీజ్ చేశారు. సుమారు రెండు కోట్ల ఆస్తులు అక్రమంగా కూడబెట్టినట్లు అధికారులు నిర్దారణకు వచ్చారు. పట్టణంలోని టౌన్ బ్యాంక్‌లో ఓ లాకర్ కూడా ఉన్నట్లు అధికారులు గుర్తించారు.
గీతాశ్రమం రోడ్డులో మరో ఇంటిని గుర్తించారు. పల్లా సుబ్బయ్యను అరెస్టు చేసి కర్నూలు ఏసీబీ కోర్టులో హాజరు పరుస్తామని డీఎస్పీ నాగభూషణం తెలిపారు. సుబ్బయ్య 1991లో పంచాయితీరాజ్ శాఖలో చిత్తూరు జిల్లాలో అసిస్టెంట్ ఇంజనీర్‌గా ఉద్యోగంలో చేరారు. అనంతరం కడప జిల్లాలోని మైదుకూరు, దువ్వూరులో పనిచేసి ప్రస్తుతం మైలవరంలో అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్‌గా విధులు నిర్వహిస్తున్నారు.