క్రైమ్/లీగల్

హోం మంత్రిపై అసభ్యకర పోస్టులు: యువకుడి అరెస్ట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నర్సీపట్నం, జూలై 2: రాష్ట్ర హోం శాఖా మంత్రి సుచరితపై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ వాట్సాప్‌లో పోస్టు చేసిన విశాఖ జిల్లా రోలుగుంట మండలం ఎంకేపట్నం గ్రామానికి చెందిన రామును గుంటూరు పోలీసులు సోమవారం అరెస్ట్ చేసిన విషయం మంగళవారం వెలుగు చూసింది. హో మంత్రి సుచరితపై అభ్యంతరకరంగా పెట్టిన పోస్టులను రామ్‌మహారాజ్ పేరుతో ఫేస్‌బుక్ అకౌంట్ నిర్వహిస్త్నుట్లు పోలీసులు నిర్ధారించారు. రోలుగుంట మండలం ఎంకేపట్నానికి చెందిన రాము ఈ ఖాతాను నిర్వహిస్తున్నట్లు గుర్తించారు. ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి, హోం మంత్రి సుచరితపై అసభ్యకర పోస్టులు పెడుతున్నాడంటూ వైసీపీ నాయకులు డీజీపీకి ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. ఈనేపథ్యంలో ఎంకేపట్నానికి చెందిన రామ్ అనే యువకుడిని గుంటూరు నుంచి వచ్చిన పోలీసులు అరెస్ట్ చేసి విశాఖకు తీసుకెళ్లారు.