క్రైమ్/లీగల్

లోక్ అదాలత్‌లో 9879 కేసుల పరిష్కారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 10: హైదరాబాద్‌లోని మెట్రోపాలిటన్ క్రిమినల్ కేసుల కోర్టు కాంప్లెక్స్‌లో శనివారం జరిగిన జాతీయ లోక్ అదాలత్‌లో 9879 కేసులను పరిష్కరించారు. తెలంగాణలోని వివిధ జిల్లాలకు చెందిన బాధితులకు 25.44 కోట్ల రూపాయల పరిహారం అందేవిధంగా తీర్పులు చెప్పారు. నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ ఆదేశాల మేరకు తెలంగాణ స్టేట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది. ప్రతి రెండు నెలలకు ఒకసారి ఈ తరహా కార్యక్రమం చేపడుతున్నారు. హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి, తెలంగాణ స్టేట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ ప్యాట్రన్-ఇన్-చీఫ్ జస్టిస్ రమేష్ రంగనాథన్, అథారిటీ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ జస్టిస్ వి. రామసుబ్రహ్మణియన్, హైకోర్టు కమిటీ చైర్మన్ జస్టిస్ పి.వి. సంజయ్ కుమార్, అథారిటీ మెంబర్ సెక్రటరీ బి.ఆర్. మధుసూదన్‌రావు ఈ కార్యక్రమాన్ని సమన్వయం చేశారు.