క్రైమ్/లీగల్

అలిపిరి వద్ద కారులో పిస్టల్, 46 రౌండ్ల బుల్లెట్లు స్వాధీనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి, ఏప్రిల్ 5: అలిపిరి వాహనాల తనిఖీ కేంద్రం వద్ద గురువారం పాండిచ్చేరికి చెందిన భక్తులు ప్రయాణిస్తున్న కారులో తనిఖీ సందర్భంగా అందులో ఒక పిస్టల్‌ను గుర్తించారు. ఈ సందర్భంగా అందులో 46 బుల్లెట్లు కూడా ఉండటం గుర్తించి, వాటిని స్వాధీనం చేసుకున్నారు. టీటీడీ తిరుపతి వి అండ్ ఎస్వో అశోక్‌కుమార్ భక్తులను విచారిస్తున్నారు. ఇటీవల కాలంలో టీటీడీ విజిలెన్స్ సిబ్బందికి తరచూ పిస్టల్స్ దొరుకుతున్న విషయం విదితమే. వాహనాల్లో దూరప్రాంతాల నుంచి వచ్చే వారు తమ భద్రత కోసం పిస్టల్స్‌ను తమ వెంట తెచ్చుకుంటున్నట్లు చెబుతున్నారు. అయితే ఘాట్ రోడ్డులోను, ముళ్ల పొదల్లోను దొరుకుతున్న పిస్టళ్లను తీసుకు వస్తున్నవారు వాటిని ఎందుకు తీసుకు వస్తున్నారన్న విషయం పోలీసులకు, విజిలెన్స్ అధికారులకు అంతుచిక్కడంలేదు. ఇలా పొదల్లో, రోడ్లపై తుపాకులు పడేసి వెడుతున్నవారు ఎక్కడైనా నేరాలు చేసి తప్పించుకోవడానికి తిరుపతి క్షేత్రాన్ని కేంద్రంగా చేసుకుంటున్నారా అనే అనుమానాలు లేకపోలేదు. ఇదిలావుండగా భద్రతను పటిష్టం చేయడం వల్లే ఇలాంటి మారణాయుధాలు తిరుమలకు వెళ్లకుండా నియంత్రించగలుగుతున్నామని సీవీ ఎస్వో ఆకె రవికృష్ణ అంటున్నారు.