క్రైమ్/లీగల్

జల్సాలకు అలవాటుపడి దోపిడీలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఘట్‌కేసర్, జూలై 11: జల్సాలకు అలవాటు దారిదోపిడీలు చేస్తున్న ముఠా గ్యాంగ్‌ను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు ఘట్‌కేసర్ పోలీసులు తెలిపారు. పోలీసుల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. హైదరాబాద్ - వరంగల్ జాతీయ రహదారి అవుషాపూర్ గ్రామ సమీపంలో బుధవారం తెల్లవారుఝామున ముఠా సభ్యులు ఓ లారీకి కారు అడ్డంగా పెట్టి లారీ డ్రైవర్‌ను కొట్టి దోపిడీ పాల్పడినట్లు తెలిపారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టిన పోలీసులు గురువారం ఉదయం యంనంపేట్ సమీపంలో వాహనాలను తనిఖీలు చేస్తుండగా మేడిపల్లికి చెందిన రంగు ఉదయ్ గౌడ్(23), గుండు అక్షయ్ కుమార్(20), ఒగ్గు నాగరాజు(19), మామిడాల రాజు(23).. కారులో వస్తుండగా పట్టుకున్నట్లు తెలిపారు. నిందితులను విచారించగా చేసిన నేరం అంగీకరించినట్లు తెలిపారని చెప్పారు. అదే గ్యాంగ్ 2018లో అన్నోజిగూడ వద్ద మోటార్ సైకిల్‌పై వెళ్తున్న ఓ వ్యక్తిని బెదిరించి అతని వద్ద రూ.2700 నగదు, సెల్‌ఫోన్‌ను దోచుకున్నట్లు ఒప్పుకున్నారని పోలీసులు తెలిపారు. ఘట్‌కేసర్‌లో 2018లో జరిగిన ఓ హత్య కేసులో రంగు ఉదయ్ గౌడ్, దోపిడీ కేసులో గుండు అక్షయ్ కుమార్ అరెస్టు అయ్యి జైలుకు వెళ్లినట్లు తెలిపారు.
నిందితులు ఉపయోగించిన కారు, మూడు సెల్‌ఫోన్లు, దోపిడీ చేసిన రూ.3000 నగదును సీజ్ చేసి నిందితులను రిమాండ్‌కు తరలించినట్లు తెలిపారు. కేసు దర్యాప్తు చేస్తున్నామని ఇన్‌స్పెక్టర్ రఘువీర్ రెడ్డి తెలిపారు.