క్రైమ్/లీగల్

యువకుడి అదృశ్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వికారాబాద్, జూలై 13: యువకుడు అదృశ్యమైన సంఘటన వికారాబాద్ పోలీస్‌స్టేషన్ పరిధిలో శనివారం చోటు చేసుకుంది. సీఐ శ్రీనివాస్‌రావు కథనం ప్రకారం.. వికారాబాద్ పట్టణం ఆలంపల్లికి చెందిన ఎండి.రఫీ సదాశివపేట్‌లోని ఓ హోటల్‌ల్లో పని చేస్తుంటారు. ప్రతినిత్యం వికారాబాద్ నుంచి సదాశివపేట్‌కు వెళ్లి వస్తుంటాడు. ఈ నెల 7వ తేదీన ఇంటి నుంచి బయల్దేరి తిరిగి ఇంటికి రాలేరు. కుటుంబ సభ్యులంతా తెలిసిన వారి వద్ద వెతికిన రఫీ వివరాలు లభించలేదు. దీంతో వికారాబాద్ పోలీస్‌స్టేషన్‌లో రఫీ భార్య హసీనా ఫిర్యాదు చేసింది. బాధితురాలు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.