క్రైమ్/లీగల్

ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టిన లారీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఘట్‌కేసర్, జూలై 16: ద్విచక్రవాహనాన్ని కారు డీకొట్టిన సంఘటనలో ఓ యువకుడు అక్కడికక్కడే మృతి చెందిన సంఘటన ఘట్‌కేసర్ పోలీసు స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. హైద్రాబాద్-వరంగల్ జాతీయ రహదారి ఎన్‌ఎఫ్‌సినగర్ అండర్ పాసు రోడ్డు వద్ద అవుషాపూర్ గ్రామానికి చెందిన డొంకెని వికాస్‌గౌడ్(27) తన మిత్రునికి చెందిన ద్విచక్రవాహనం పై సోమవారం రాత్రి ఘట్‌కేసర్‌కు తన సోంత పనుల నిమిత్తమై వేళ్లుచుండగా ఎదురుగా వేగంగా వచ్చిన లారీ డీ కొట్టినట్లు తెలిపారు. దింతో యువకుడికి తీవ్ర గాయాలు కాగ, చికిత్స నిమిత్తం నగరంలోని ఆదిత్య ఆసుపత్రికి తరలించినట్లు తెలిపారు. పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన చికిత్స నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించగా మంగళవారం ఉదయం మృతి చెందినట్లు తెలిపారు. మృతుడు కారు డ్రైవర్‌గా విధులు నిర్వహిస్తాడని, మృతదేహన్ని పోస్టుమార్టం అనంతరం బంధువులకు అప్పగించినట్లు తెలిపారు. మృతుని బంధువుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నట్లు ఇన్‌స్పెక్టర్ రఘువీర్‌రెడ్డి తెలిపారు.