క్రైమ్/లీగల్

నెలాఖరు వరకూ మధ్యవర్తుల కమిటీనే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూలై 18: అయోధ్యలో వివాదాస్పద బాబ్రీ మసీదు- రామజన్మభూమి స్థల వివాదంపై ఏర్పాటైన మధ్యవర్తులు కమిటీని కొనసాగించాలని సుప్రీం కోర్టు నిర్ణయించింది. ఈనెలాఖరు వరకూ కమిటీ పనిచేస్తుంది. ఈలోగా కమిటీ ఇచ్చిన నివేదిక పరిశీలించిన తరువాత ఆగస్టు 1న తుది నిర్ణయం తీసుకుంటామని ఐదుగురు న్యాయమూర్తులతోకూడిన రాజ్యాంగ ధర్మాసనం గురువారం ప్రకటించింది. మధ్యవర్తుల కమిటీ పనితీరు సంతృప్తికరంగా లేదని, ఈ అంశాన్ని న్యాయస్థానమే చేపట్టాలని దాఖలైన పిటిషన్‌ను సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగోయ్ నేతృత్వంలోని రాజ్యాంగ ధర్మాసనం విచారించింది. కమిటీ నివేదిక చూశాకే ఆగస్టు 2న తమ నిర్ణయం ప్రకటిస్తామని కోర్టు వెల్లడించింది. కమిటీ గడువుఈనెల 18తో ముగియనుండగా మరో 15 రోజులు కొనసాగేలా న్యాయస్థానం అనుమతి ఇచ్చింది. ‘నివేదిక పరిశీలించిన తరవాత ఏ నిర్ణయమైనా.. ఒక వేళ కేసు విచారణక చేపట్టాల్సి వస్తే ఎప్పుడనేది ఆగస్టు 2న ప్రకటిస్తాం’ న్యాయమూర్తులు ఎస్‌ఏ బాబ్డే, డీవై చంద్రచూడ్, అశోక్ భూషణ్, ఎస్‌ఏ నజీర్‌తో కూడిన రాజ్యాంగ ధర్మాసనం స్పష్టం చేసింది. జూలై 31 వరకూ ఉన్న పరిస్థితులపై సమగ్ర నివేదిక ఇవ్వాలని సుప్రీం కోర్టు మాజీ న్యాయమూర్తి ఎఫ్‌ఎంఐ కలీఫుల్లా అధ్యక్షతన గల మధ్యవర్తుల కమిటీని కోర్టు ఆదేశించింది. ‘ఈనెలాఖరు వరకూ ఉన్న పరిస్థితులపై నివేదిక ఇవ్వండి’అని కమిటీకి స్పష్టం చేశారు. బాబ్రీమసీదు- రామజన్మభూమి స్థల వివాదంపై మాజీ న్యాయమూర్తి కలీఫుల్లా అధ్యక్షతన ఏర్పాటైన కమిటీలో ఆర్ట్‌ఆఫ్ లివింగ్ వ్యవస్థాపకుడు శ్రీశ్రీ రవిశంకర్, సీనియర్ న్యాయవాది శ్రీరామ్ పంఛూ సభ్యులుగా ఉన్నారు. అయోధ్యకు ఏడు కిలోమీటర్ల దూరంలో ఉన్న ఫైజాబాద్ కేంద్రంగా మధ్యవర్తుల కమిటీ పనిచేయడానికి ఉన్నత న్యాయస్థానం వీలు కల్పించింది. సమస్యకు ఓ సామరస్య పరిష్కారం సూచించాలని కమిటీని కోరింది. కమిటీకి అన్ని ఏర్పాట్లు అలాగే భద్రత విషయాలు చూడాలని యూపీ సర్కార్‌ను కోర్టు ఆదేశించింది.