క్రైమ్/లీగల్

ఎన్‌కౌంటర్లపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాల్సిందే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ : పోలీసులు జరిపే ఎన్‌కౌంటర్లపై తప్పనిసరిగా ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ (ఎఫ్‌ఐఆర్) నమోదు చేయాల్సిందేనని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. ఎన్‌కౌంటర్లపై పీపుల్స్ యూనియన్ ఫర్ సివిల్ లిబర్టీస్-స్టేట్ ఆఫ్ మహారాష్ట్ర కేసులో గతంలో జస్టిస్ ఆర్‌ఎం లోథా, జస్టిస్ రోహింటన్ ఫాలీ నారిమన్‌లతో కూడిన ధర్మాసనం ఇచ్చిన మార్గదర్శకాలను అమలు చేయాల్సిదేనని ధర్మాసనం స్పష్టం చేసింది. ఎన్‌కౌంటర్లపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేసిన వెంటనే ఆ విషయాన్ని కోర్టు దృష్టికి తీసుకురావాలని సూచించింది. పోలీసుల ఎన్‌కౌంటర్లపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలంటూ గతంలో ఉమ్మడి హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను సవాల్ చేస్తూ ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు, ఏపీ పోలీస్ ఆఫీసర్స్ అసోసియేషన్ సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేశాయి. ఈ పిటిషన్‌ను గురువారం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్, జస్టిస్ దీపక్ గుప్తా, జస్టిస్ అనిరుద్ధ బోస్‌లతో కూడిన ధర్మాసనం ముందుకు విచారణకు వచ్చింది. ఏపీ సివిల్ లిబర్టీస్ కమిటీ తరపున సీనియర్ న్యాయవాది కొలిన్ గోంజాలాస్ వాదనలు వినిపించారు. పోలీసులు నకిలీ ఎన్‌కౌంటర్లు చేస్తున్నారని, వాస్తవంగా పట్టుకొచ్చి కాల్చేసి వాటిని ఎన్‌కౌంటర్లగా చిత్రీకరిస్తున్నారని వివరించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరపున సీనియర్ న్యాయవాది బసంత్ వాదనలు కొనసాగిస్తూ.. పార్లమెంట్‌పై ఉగ్రదాడిని పేర్కొంటూ ఆ సమయంలో ఎన్‌కౌంటర్ చేస్తే ఎఫ్‌ఐఆర్ నమోదు చేస్తే.. పోలీసుల మనోధైర్యం సన్నగిల్లుతుందని వివరించారు.