క్రైమ్/లీగల్

ఆరేళ్ల చిన్నారిపై టీచర్ లైంగిక దాడి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మార్కాపురం, జూలై 21: విద్యాబుద్ధులు నేర్పాల్సిన ఉపాధ్యాయుడు వక్రమార్గం పట్టాడు. కామంతో కళ్లు మూసుకుపోయిన ఆ అయ్యోరు అభం శుభం తెలియని చిన్నారిపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈ విషయం తెలిసిన తల్లిదండ్రులు పాప భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని మిన్నకున్నారు. వేరే పాఠశాలలో తమ చిన్నారిని చేర్పించారు. కానీ మదమెక్కిన ఆ ఉపాధ్యాయుడు చిన్నారి ఇంటికి వెళ్లి తమ పాఠశాలకే పంపాలని గొడవ చేయడంతో చేసేదేమీలేక పోలీసులను ఆశ్రయించడంతో ఈ విషయం శనివారం రాత్రి వెలుగులోకి వచ్చింది. మార్కాపురం సీఐ కేవీ రాఘవేంద్ర కథనం మేరకు ఈ సంఘటన వివరాలిలా ఉన్నాయి. ప్రకాశం జిల్లా అర్థవీడు మండల కేంద్రానికి చెందిన బాలిక తల్లిదండ్రులు తమ ఆరేళ్ల చిన్నారిని అర్థవీడులోని శ్రీ సిద్దారెడ్డి, సాయిరెడ్డి మెమోరియల్ ఎయిడెడ్ పాఠశాలలో ఒకటో తరగతిలో చేర్చారు. ఈనెల 12వ తేదీ సాయంత్రం ఇంటికి వెళ్లిన చిన్నారి కడుపునొప్పితో బాధ పడింది. దీనిపై ఆమె తల్లి విచారించగా తనను ఈనెల 11, 12 తేదీల్లో పాఠశాలలో పనిచేస్తున్న గోపి అనే ఉపాధ్యాయుడు వేరే గదిలోకి తీసుకెళ్లి లైంగిక దాడి చేసినట్లు తెలిపింది. ఈ విషయం తెలిస్తే పరువు పోతుందనే భయంతో బాలిక తల్లి బయటకు చెప్పలేదు. దీంతో ఈనెల 13వ తేదీన తన కుమార్తెను వేరే ప్రైవేటు పాఠశాలలో చేర్పించింది. ఈ విషయం తెలుసుకున్న చిన్నారిపై అఘాయిత్యానికి పాల్పడిన ఉపాధ్యాయుడు గోపి ఈనెల 20న ఆమె ఇంటికి వెళ్లాడు. తనకు ఆ విద్యార్థిని ఆధార్‌కార్డు, బ్యాంకు ఖాతా పుస్తకం ఇవ్వాలని విద్యార్థిని తల్లిని అడిగాడు. సమాచారం తెలుసుకున్న మార్కాపురం సీఐ కేవీ రాఘవేంద్ర అర్థవీడు వెళ్లి చిన్నారి తల్లి, బాధితురాలి అమ్మమ్మ ఫిర్యాదు మేరకు ఉపాధ్యాయుడు గోపీపై ఫోక్సో చట్టం, 376, 509 చట్టాల కింద కేసు నమోదు చేశారు.