క్రైమ్/లీగల్

ప్రేమజంట ఆత్మహత్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

యాడికి, జూలై 21: పెళ్లికి పెద్దలు నిరాకరించడంతో ఓ ప్రేమజంట ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటన అనంతపురం జిల్లా యాడికి మండలం నగరూరు గ్రామంలో ఆదివారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. గ్రామానికి చెందిన రంగనాథచౌదరి, సరస్వతి దంపతుల కుమారుడు వినోద్‌కుమార్(23), అదేగ్రామానికి చెందిన వెంకటచౌదరి కుమార్తె చరిత(21) కొనే్నళ్లుగా ప్రేమించుకుంటున్నారు. వినోద్‌కుమార్ బీటెక్ పూర్తి చేసి ఉద్యోగ ప్రయత్నంలో ఉన్నాడు. చరిత చెన్నైలో ఓ ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం చేస్తోంది. ఈ నేపథ్యంలో వారిద్దరూ పెళ్లి చేసుకోవాలని నిర్ణయించకున్నారు. వీరి పెళ్లికి ఇరు కుటుంబాలు నిరాకరించాయి. దీంతో జీవితంపై విరక్తి చెందిన వినోద్‌కుమార్ శనివారం ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. వెంటనే కుటుంబీకులు అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ అర్ధరాత్రి మృతిచెందాడు. విషయం తెలుసుకున్న చరిత తన ఇంట్లోనే విషపుగుళికలు మింగి ఆత్మహత్యకు పాల్పడింది. వెంటనే కుటుంబీకులు అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ ఆమె కూడా మృతి చెందింది. దీంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.