క్రైమ్/లీగల్

బాలుడి దుర్మరణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్ / సికింద్రాబాద్, జూలై 21: సికింద్రాబాద్ పరిధిలోని సీతాఫర్‌మండిలో ఓ పురాతన భవనం కూలి ఓ బాలుడు మృతి చెందగా.. తల్లికి తీవ్ర గాయాలైన సంఘటన సికింద్రాబాద్ చిలకల్‌గూడ పోలీస్టేషన్ పరిధిలో ఆదివారం ఉదయం చోటుచేసుకుంది. చిలకల్‌గూడ పోలీసుల కథనం ప్రకారం.. సీతాఫల్‌మండిలోని ఓ పురాతన భవనంలో పాల వ్యాపారం చేస్తున్న రాజు యాదవ్, అతని భార్య స్వాతితో పాటు 14 నెలల బాలుడు గీతాన్ష్‌తో నివాసం ఉంటున్నారు. రోజు మాదిరిగానే పాల వ్యాపారం చేసే రాజు యాదవ్ ఆదివారం ఉదయం ఆరు గంటల ప్రాంతంలో బయటికి వెళ్లాడు. ఇంట్లో పడుకున్న అతని భార్య స్వాతి, కుమారుడు గీతామ్స్ నిద్రిస్తున్న సమయంలో ఇంటి పైకప్పు ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. దీంతో 14 నెలల బాలుడు గీతాన్ష్‌కు తీవ్రగాయాలై అక్కడిక్కడే మృతి చెందాడు. పాలవ్యాపారి భార్య స్వాతికి తీవ్ర గాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న స్థానికులు హుటాహుటిన స్వాతిని చికిత్స నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. చిలకల్‌గూడ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని కేసు దర్యాప్తు జరుపుతున్నారు. జీహెచ్‌ఎంసీ డిప్యూటీ కమిషనర్ రవికుమార్ ఘటనాస్థలాన్ని పరిశీలించారు.

గీతాన్ష్‌ (ఫైల్‌ఫొటో)