క్రైమ్/లీగల్

ఈ జైలు శిక్షలు మరెంతకాలం?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, జూలై 22: మాలెగావ్ పేలుళ్ల కేసులో నిందితులకు పడిన శిక్షలు అంచెనాగా మరెంత కాలం ఉన్నాయో తెలియజేయాలని జాతీయ పరిశోధనా సంస్థ (ఎన్‌ఐఏ)ను బాంబే హైకోర్టు కోరింది. 2008నాటి పేలుళ్ల కేసులో శిక్ష అనుభవిస్తున్న నిందితుడు సమీర్ కుల్‌కర్ణి తన జైలు శిక్షను మరో ఆరు నెలల్లో ముగించే విధంగా కింది కోర్టును ఆదేశించాలని బాంబే హైకోర్టును ఆశ్రయించాడు. ఈ మేరకు రణ్‌జీత్‌సింగ్ మోర్, భారతి డాంగ్రేల డివిజన్ పిటిషన్‌ను విచారించింది. నిందితుడికి శిక్ష మరెంతకాలం ఉందో చెప్పాలని డివిజన్ బెంచ్ జాతీయ పరిశోధనా సంస్థ అడ్వొకేట్ సందేశ్ పాటిల్‌ను కోరింది. రెండు వారాల్లోగా వివరాలు ఇవ్వాలని బెంచ్ ఎన్‌ఐఏను ఆదేశించింది. ఈ కేసులో 475 మంది సాక్షుల్లో కింది కోర్టు ఇంతవరకు 124 మంది సాక్షులను విచారించిందని పాటిల్ కోర్టుకు చెప్పారు.