క్రైమ్/లీగల్

కారు.. బైక్ ఢీకొని వ్యక్తి మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చండూరు, ఫిబ్రవరి 11: కారు ఢీకొని వ్యక్తి మృతి చెందిన సంఘటన ఆదివారం చండూరు మండల పరిధిలోని పుల్లెంల గ్రామ సమీపంలో చోటుచేసుకుంది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం మండలంలోని గుండ్రపల్లి గ్రామానికి చెందిన కురుపాటి శ్రీను, జిల్లా నరేష్‌లు తాపీ పని కోసం చొల్లేడు గ్రామానికి వెళ్తున్నారు. పుల్లెంల గ్రామ సమీపంలోని మూల మలుపు వద్దకు చేరుకోగానే ఎదురుగా వస్తున్న కారు ఢీకొట్టడంతో కురుపాటి శ్రీను (30) అక్కడికక్కడే మృతి చెందాడు. జిల్లా నరేష్‌కు తీవ్ర గాయాలు కావడంతో జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతుడి కుటుంబానికి న్యాయం చేయాలని గ్రామస్తులు మండల కేంద్రంలో రాస్తారోకో చేశారు. ఫిర్యాదు అందగానే కేసునమోదు చేసి దర్యాప్తు చేస్తామని సీఐ రమేష్ తెలిపారు.