క్రైమ్/లీగల్

నీటి గుంటలో పడి ఇద్దరు చిన్నారులు మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సిరిసిల్ల, ఫిబ్రవరి 11: ఆదివారం సెలవు దినం కావడంతో ఇద్దరు చిన్నారుల పాలిట మృత్యువు రూపంలో కబలించింది. ఆదివారం సిరిసిల్ల మండలం చంద్రంపేట శివారులోని ఇటుక బట్టీల వద్ద ఆడుకోవడానికి వెళ్ళిన కార్మికుల కుటుంబాలకు చెందిన ఇద్దరు చిన్నారులు మృత్యువు పాలయ్యారు. బింజూ సునాన(4), రింకూ సునా(2) అనే ఇద్దరు పిల్లలు ఆడుకోవడానికి వెళ్ళి నీటి కోసం తవ్విన గుంతలో పడి దుర్మరణం పాలయ్యారు. ఆదివారం సెలవు కావడంతో కావడంతో ఈ ఇద్దరు పిల్లలు ఆడుకోవడానికి వెళ్ళి ఈ ప్రమాదానికి గురయ్యారు. రెండు నెలల క్రితం చిన్నారుల తల్లి తండ్రులు రూపాధర్ సునా, మీనా సునాలు ఒరిస్సా నుండి బతుకు తెరువు కోసం ఇక్కడికి వచ్చారు. చంద్రంపేట శివారులోని ఇటుక బట్టీల వద్ద పని చేస్తున్నారు. అయితే ఇక్కడ నీటి కోసం కొంత దూరంలో గుంతను తోడగా, అందులో నీరు నిండి ఉండడంతో ఇద్దరు చిన్నారులు ఆ గుంతలో పడి దుర్మరణం పాలయ్యారు. ఆదివారం సాయంత్రం నాలుగు గంటల వరకు కూడా పిల్లలు రాకపోవడంతో వారు ఆ ప్రాంతంలో వెతుకడంతో గుంతలో శవాలై తేలారు. ఈ సంఘటనపై సిరిసిల్ల ఎస్సై అలీ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.