క్రైమ్/లీగల్

కొండచరియలు విరిగిపడిన ఘటనల్లో 34కు చేరుకున్న మృతులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మావ్లమైన్ (మైన్మార్), ఆగస్టు 10: ఈశాన్య మైన్మార్ ప్రాంతంలో గత కొద్దిరోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో పలు ప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడిన సంఘటనల్లో మృతుల సంఖ్య 34కు చేరుకుంది. ఈ విషయాన్ని సంబంధిత అధికార వర్గాలు శనివారంనాడు వెల్లడించాయి. కొండచరియల కింద చిక్కుకుపోయిన వారిని బయటకు తీసేందుకు సహాయక చర్యలు కొనసాగుతున్నాయని ఆ వర్గాలు పేర్కొన్నాయి. ఏటా వర్షాకాలంలో మైన్మార్‌లో కుండపోత వర్షాలు పడడం, పలుచోట్ల కొండచరియలు విరిగిపడడం మామూలే. అదేవిధంగా గత కొద్దిరోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతోపాటు కొండ ప్రాంతాల్లోని కొండచరియలు విరిగిపడుతుండడంతో వేలాదిమంది సురక్షిత ప్రాంతాలకు తరలిపోయారు. కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు, వరదల వల్ల ఇళ్లు కూలిపోయిన నేపథ్యంలో వాటి కింద చిక్కుకుపోయిన వారి కోసం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. శనివారంనాటికి దాదాపు 34 మృతదేహాలను పలు ప్రాంతాల నుంచి వెలికితీసినట్టు అధికార వర్గాలు తెలిపాయి. 47 మంది తీవ్రంగా గాయపడగా, దాదాపు 80 మంది వరకు గల్లంతైనట్టు తెలిపాయి.