క్రైమ్/లీగల్

‘ప్రవీణ్’ తరహాలోనే శ్రీనివాస్‌రెడ్డి కేసు విచారణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నల్లగొండ, ఆగస్టు 10: యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మలరామారం మండలం హాజీపూర్‌లో ముగ్గురు బాలికలను అత్యాచారం చేసి హత్య చేసిన సైకో కిల్లర్ శ్రీనివాస్‌రెడ్డి కేసులో పోలీసులు కీలక సాక్ష్యాధారాలను సేకరించారు. హన్మకొండలో తొమ్మిది నెలల పసిపాపపై అత్యాచారం, హత్యకు పాల్పడిన నిందితుడు పోలేపాక ప్రవీణ్ కేసులో ఫాస్ట్‌ట్రాక్ కోర్టు ద్వారా 48రోజుల్లో దర్యాప్తు, విచారణ, ఉరి శిక్ష విధింపులో విజయవంతమైన పోలీస్, న్యాయశాఖలు శ్రీనివాస్‌రెడ్డి కేసుల్లోనూ అదే తరహా దూకుడుతో ముందుకెలుతున్నారు. హాజీపూర్‌లో శ్రావణి, మనిషా, కల్పనలను అత్యాచారం చేసి హత్య చేసిన కేసులో టెక్నికల్, ఎఫ్‌ఎస్‌ఎల్ రిపోర్ట్ పోలీసులకు చేరింది. ఈ రిపోర్టుల్లో నిందితుడు శ్రీనివాస్‌రెడ్డినే బాలికలపై అత్యాచారం, హత్యలకు పాల్పడినట్లుగా నిర్ధారణయినట్లుగా పోలీస్ వర్గాల సమాచారం. బాలికల మృతదేహాలపై ఉన్న రక్తపు మరకలు శ్రీనివాస్‌రెడ్డివేనని ఎఫ్‌ఎస్‌ఎల్ రిపోర్టు తేల్చినట్లుగా తెలుస్తుంది. అలాగే నిందితుడు శ్రీనివాస్‌రెడ్డి సెల్‌ఫోన్ కాల్‌డేటాలు, మేసేజ్‌లు, వీడియోల నుండి ఈ కేసుకు సంబంధించిన ఆధారాలను సైతం పోలీసులు సేకరించారు. ఈ కేసుల్లో ఇప్పటిదాకా 300మంది వరకు విచారించిన పోలీసులు నేర నిరూపణకు బలమైన సాక్ష్యాలు సేకరించి కోర్టుకు అందచేశారు. ఫాస్ట్‌ట్రాక్ కోర్టు ద్వారా నిందితుడు శ్రీనివాస్‌రెడ్డికి వీలైనంత త్వరలో శిక్ష పడేలా పోలీస్ శాఖ తన ప్రయత్నాలు ముమ్మరం చేశారు.