క్రైమ్/లీగల్

బాలికపై సామూహిక అత్యాచారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వరంగల్, ఆగస్టు 11: కఠిన శిక్షలు కామాంధులను కట్టడి చేయలేకపోతున్నాయ్. ఉరిశిక్షలు కూడా వారి నుండి అమాయకున ఆడపిల్లలను రక్షించలేకపోతున్నాయి. మొన్ననే ఒక కామాంధుడికి ఉరిశిక్ష పడిందని ఊపిరి పీల్చుకునే లోగా వరంగల్‌లో మరో దారుణం చోటు చేసుకుంది. హన్మకొండ సమ్మయ్య నగర్ కాలనీకి చెందిన తొమ్మిదో తరగతి చదువుతున్న బాలిక ఆదివారం అత్యాచారానికి గురైంది. వరంగల్ నగరానికి చెందిన ఐదుగురు కామాంధులు ఆ బాలికపై ముకుమ్మడిగా అత్యాచారం చేసినట్టు సమాచారం. ఆ అవమానాన్ని తట్టుకోలేకపోయ న బాధితురాలు ఇంట్లో
ఉరివేసుకొని ఆత్మహత్యకు చేసుకుంది. కాగా, ఈ బాలికపై హసన్‌పర్తి మండలం పెంబర్తి గ్రామానికి చెందిన ఐదుగురు యువకులు గ్యాంగ్ రేప్ చేశారని బాధిత బందువులు ఆరోపిస్తున్నారు. ఇందులో ఇద్దరు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు తెలిసింది. మిగతావారు పరారీలో ఉన్నట్టు సమాచారం. పోలీసుల అదుపులో ఉన్న వారిలో పెంబర్తి గ్రామానికి చెందిన ప్రసన్నకుమార్ (16), తిరుపతి (20) ఉన్నట్టు సమాచారం. ఈ విషయంపై కాకతీయ యూనివర్సిటీ సర్కిల్ ఇన్‌స్పెక్టర్ డేవిడ్‌ను వివరణ కోరగా తర్వాత చెపుతామని సమాధానం ఇచ్చారు. ఇదిలా ఉండగా ఆత్మహత్య చేసుకున్న బాలిక మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. బాలికపై అత్యాచారం జరిగిన విషయం వరంగల్ నగరంలో దావానంలా వ్యాపించింది.