క్రైమ్/లీగల్

కాశ్మీర్‌లో ఆంక్షలపై నేడు సుప్రీం విచారణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఆగస్టు 12: కాశ్మీర్‌కు ప్రత్యేక హోదా కల్పిస్తున్న 370 అధికరణ రద్దు నేపథ్యంలో కాశ్మీర్‌లో అత్యంత తీవ్రస్థాయిలో ఆంక్షలు విధించాలని, ప్రజలకు హక్కులను కాలరాశారంటూ దాఖలైన పటిషన్‌పై మంగళవారం సుప్రీం కోర్టు కీలక విచారణ జరపబోతోంది. కాంగ్రెస్ కార్యకర్త తెహసీన్ పూనావాలా ఈ పిటిషన్ దాఖలు చేశారు. న్యాయమూర్తులు అరుణ్ మిశ్రా, ఎంఆర్ షా, అజయ్ రస్తోగిలతో కూడిన సుప్రీం బెంచ్ పరిశీలనకు ఈ పిటిషన్ రాబోతోంది. అలాగే జర్నలిస్టులపై విధించిన ఆంక్షలకు సంబంధించి కాశ్మీర్ టైమ్స్ ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ అనురాధా భాసిన్ మరో పిటిషన్ దాఖలు చేశారు. ఇది కూడా విచారణకు వచ్చే అవకాశం కనిపిస్తోంది. 370 అధికరణ రద్దుకు సంబంధించి తాను ఎలాంటి వ్యాఖ్యలను చేయడం లేదని.. ఆంక్షలను తొలగించాలని మాత్రమే కోరుతున్నామని పూనావాలా తెలిపారు. ఫోన్లు, ఇంటర్నెట్ సర్వీసులను, వార్తా చానళ్లను కూడా నిలిపివేశారని.. ఒమర్ అబ్దుల్లా, మెహబూబా ముఫ్తీ సహా అనేక మంది రాష్ట్ర నాయకులను నిర్బంధంలో ఉంచారని.. వీరందరినీ విడుదల చేయాల్సిన అవసరం ఉందని తెలిపారు.