క్రైమ్/లీగల్

మణిక్రాంతి తల కోసం తీవ్ర గాలింపు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (క్రైం), అగస్టు 12: సంచలనం రేపిన వివాహిత మణిక్రాంతి తల కోసం తీవ్ర గాలింపు కొనసాగుతోంది. ఇదే సమయంలో హత్యకు వినియోగించిన ఆయుధం కేసు దర్యాప్తులో కీలకం కావడంతో కత్తి కోసం కూడా పోలీసులు వెతుకులాట చేపట్టారు. నిందితులకు న్యాయస్థానంలో కఠిన శిక్ష పడుతుందని పోలీసులు చెపుతున్నా తల లేకపోవడంతో దర్యాప్తుకు సంబంధించి న్యాయనిపుణుల సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలుస్తోంది. దీంతో ఎలాగైనా హతురాలి తలను గుర్తించేందుకు ఏలూరు కాల్వలో గాలింపు చర్యల్లో భాగంగా రంగంలోకి దిగిన ఎన్డీఆర్‌ఎఫ్, ఎస్డీఆర్‌ఎఫ్ బృందాలు జల్లెడ పడుతున్నాయి. మరోవైపు మణిక్రాంతి మృతదేహానికి సోమవారం పోస్టుమార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించగా అంత్యక్రియలు పూర్తయ్యాయి. కుటుంబం మొత్తం శోకసముద్రంలో మునిగిపోయింది. కాగా బాధిత కుటుంబాన్ని సోమవారం సాయంత్రం రాష్ట్ర మహిళా కమిషన్ చైర్‌పర్సన్ వాసిరెడ్డి పద్మ పరామర్శించారు. మణిక్రాంతికి ప్రాణహాని ఉందని ముందుగానే పోలీసులకు ఫిర్యాదు ఇచ్చినా పోలీసు అధికారులు ఎందుకు చర్యలు తీసుకోలేదని ఆమె ప్రశ్నించారు. దీంతో పోలీసుల వైఖరిపై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. స్థానిక పోలీసుల నిర్లక్ష్య ధోరిణితో నిండుప్రాణం బలైందనే ఆవేదన జనంలో నెలకొంది. సత్యనారాయణపురం పోలీస్టేషన్ పరిధిలోని శ్రీనగర్‌లోని నాలుగోలైన్‌లో నివాముంటున్న మణి ఇంటికెళ్లిన భర్త ప్రదీప్ కుమార్ పథకం ప్రకారం కత్తితో దాడి చేసి కిరాతకంగా నరికి, తలను మొండెం నుంచి వేరుచేసి తీసుకెళ్లి ఏలూరు కాల్వలో పడేసిన విషయం తెలిసిందే. హత్యకు ఉపయోగించిన కత్తిని కూడా నీటిలో విసిరేసినట్లు పోలీసులు చెబుతున్నారు. ఘటనకు సంబంధించి దర్యాప్తు చేపట్టిన ఏసీపీ, సీఐ బాలమురళీకృష్ణ నేతృత్వంలో కాల్వలో గాలింపు కొనసాగుతోంది. సోమవారం ఏలూరు కాల్వలో ఎన్డీఆర్‌ఎఫ్, ఎస్డీఆర్‌ఎఫ్ ప్రత్యేక దళాలు బోట్లలో తిరుగుతూ మరోవైపు జాలర్ల సాయంతో వలలు వేసి తల కోసం గాలించారు. నీటిలో అయస్కాంతాలు వేసి ఆయుధం కోసం వెతుకులాడారు. మూడు ప్రత్యేక బృందాలు గాలింపు చర్యల్లో పాల్గొన్నట్లు సీఐ తెలిపారు. పరారీలో ఉన్నట్లు చెబుతున్న నిందితుని కోసం కూడా బృందాలు గాలిస్తున్నాయని, కుటుంబ సభ్యుల ఆరోపణ మేరకు ప్రదీప్‌కుమార్‌తో పాటు అతని కుటుంబ సభ్యుల పాత్రపై విచారణ చేస్తున్నామని, ఘటన వెనుక బాధ్యులెవరున్నా వదిలేది లేదని స్పష్టం చేశారు. తల దొరకకపోవడంతో కేసుకు సంబంధించి న్యాయపరమైన అంశాలను పరిగణనలోకి తీసుకుంటున్నామని, కోర్టులో దోషులకు కచ్చితంగా శిక్ష పడుతుందని చెప్పారు. బాధిత కుటుంబానికి కేసు విషయమై అపోహపడాల్సిన అవసరం లేదన్నారు.