క్రైమ్/లీగల్
భయపెట్టి బాలికపై అత్యాచారం
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
విశాఖపట్నం(క్రైం), ఫిబ్రవరి 11: ఎన్‌ఏడీ కాలనీలో నివాసముంటున్న సాయివివేక్ ఎన్‌ఏడీ కొత్తరోడ్డు సమీపంలో గల ఎంఓవీలో క్యాజువల్ లేబర్‌గా పని చేస్తున్నాడు. దుర్గాపురంలో ఉంటున్న రాజుకు ముగ్గురు కుమార్తెలు. పెద్ద కుమార్తె (17) సమీపంలోని ఎన్‌ఏడీ ఉన్నత పాఠశాలలో ప్రస్తుతం పదవ తరగతి చదువుతుంది. స్కూలుకు వెళ్లినప్పుడు తరుచూ బాలిక వెంట సాయివివేక్ పడుతూ ప్రేమించమని వేధించేవాడని పోలీసులు తెలిపారు. అయితే బాలిక నిరాకరించడంతో ప్రేమించకపోతే చచ్చిపోతానని వేధించేవాడు. ఈ తరుణంలో శనివారం ఆమెను బెదిరించి, ఎన్‌ఏడీ క్వార్టర్స్ సమీపంలోని కారు షెడ్డు వద్దకు తీసుకుని వెళ్లి బలవంతంగా బాలికపై సాయి వివేక్ అత్యాచారం చేశాడు. తర్వాత జరిగిన విషయాన్ని ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులకు బాలిక చెప్పడంతో వారు ఆదివారం స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈమేరకు పోలీసులు సాయివివేక్‌పై కేసు నమోదు చేసి అతనిని అదుపులోకి తీసుకున్నారు. బాలికను వైద్య పరీక్షల నిమిత్తం కేజీహెచ్‌కు తరలించారు. సీఐ మళ్ల శేషు నేతృత్వంలో ఎయిర్‌పోర్టు పోలీసులు కేసును దర్యాప్తు చేస్తున్నారు.