క్రైమ్/లీగల్

వరకట్న వేధింపులకు గృహిణి బలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పెనమలూరు, ఆగస్టు 22: వరకట్నం కోసం భర్త నిత్యం పెట్టే వేధింపులు భరించలేక ఓ గృహిణి నిండు ప్రాణాలు బలయ్యాయ. సంఘటన పెనమలూరు పోలీస్ స్టేషన్ పరిధిలో గురువారం సంచలనం రేకెత్తించింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. యనమలకుదురు గ్రామానికి చెందిన ఎర్రంశెట్టి అప్పారావుకు సంధ్యారాణితో 13ఏళ్ల క్రితం వివాహం జరిగింది. వారికి ఇద్దరు పిల్లలు. ఇచ్చిన కట్నం చాలటం లేదని, మళ్లీ పుట్టింటి నుండి అదనపు కట్నం తెమ్మని సంధ్యారాణిని వేధించేవాడు. తాగి వచ్చి కట్నం తీసుకురమ్మని శారీరకంగా హింసించేవాడు. నాలుగు రోజుల క్రితం కూడా ఇద్దరి మధ్య గొడవ వస్తే సంధ్యారాణి అన్న కందుల సైదయ్య గుంటూరు జిల్లా నుండి వచ్చి రాజీ కుదిర్చాడు. గురువారం ఉదయం అప్పారావు తండ్రి దేవానందం సైదయ్యకు ఫోన్ చేసి మీ చెల్లెలు ఉరిపోసుకుని చనిపోయిందని చెప్పాడు. దీంతో సైదయ్య పోలీసులను ఆశ్రయించాడు. ఈ సందర్భంగా సైదయ్య మాట్లాడుతూ తన చెల్లెలు ఉరేసుకుని చనిపోయేంత పిరికిది కాదని, తానుపోతే ఇద్దరు పిల్లలు అనాథలుగా మారతారన్న భయం ఆమెకు ఉందన్నారు. ఇలా ఎన్ని బాధలు, హింసలు పెట్టినా పెరుగుతున్న పిల్లలను చూసి మారతాడన్న నమ్మకంతో ఉందన్నారు. ఆమె మరణానికి కారకుడు తన బావ అప్పారావేనని కన్నీళ్ల పర్యంతమయ్యాడు. ఇది ఆత్మహత్య కాదని, అప్పారావు, వారి కుటుంబ సభ్యులు కలిసి హత్య చేశారని, పోలీసులు న్యాయం చేయలన్నారు. విషయం తెలిసిన వెంటనే సీఐ సత్యనారాయణ సంఘటన స్థలానికి వెళ్లి క్షుణ్ణంగా పరిశీలించారు. ఎస్‌ఐ వెంకటేష్ అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం ప్రభుత్వాసుపత్రికి తరలించారు.