క్రైమ్/లీగల్

అజిత్ పవార్‌పై కేసు పెట్టండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, ఆగస్టు 22: మహారాష్ట్ర స్టేట్ సహకార బ్యాంక్ (ఎంఎస్‌సీబీ) కుంభకోణం కేసులో ఎన్‌సీపీ నాయకుడు అజిత్ పవార్, మరో 70 మందిపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలని బొంబాయి హైకోర్టు గురువారం ముంబయి పోలీసు శాఖలోని ఆర్థిక నేరాల విభాగాన్ని (ఈఓడబ్ల్యూ) ఆదేశించింది. ఈ కేసులో అజిత్ పవార్ తదితరులకు వ్యతిరేకంగా విశ్వసనీయ ఆధారాలు ఉన్నాయని కోర్టు పేర్కొంది. న్యాయమూర్తులు ఎస్‌సీ ధర్మాధికారి, ఎస్‌కే షిండేలతో కూడిన హైకోర్టు ధర్మాసనం వచ్చే అయిదు రోజుల్లోగా ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలని ఈఓడబ్ల్యూను ఆదేశించింది. మహారాష్ట్ర మాజీ ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్‌తో పాటు ఎన్‌సీపీ నాయకుడు జయంత్ పాటిల్, రాష్ట్రంలోని 34 జిల్లాలకు చెందిన అనేక మంది సీనియర్ సహకార బ్యాంకు అధికారులు ఈ కేసులో నిందితులుగా ఉన్నారు.