క్రైమ్/లీగల్

ఏసీబీ వలలో అవినీతి చేపలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జగిత్యాల: అవినీతి నిరోధక శాఖ వలలో అవినీతి చేపలు పట్టుబడడం జగిత్యాల జిల్లా కేంద్రంలో గురువారం కలకలం రేపింది. జిల్లా మత్స్యశాఖ అధికారి రాణాప్రతాప్, సీనియర్ అసిస్టెంట్ నూరొద్దీన్ ఖాజా రూ.60వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ డీఎస్పీ భద్రయ్య ఆధ్వర్యంలో సీఐలు సంజీవ్, రాము, వేణుగోపాల్ పకడ్బందీగా దాడి చేసి పట్టుకున్నారు. జిల్లాలోని మెట్‌పల్లి మండలం మండలం జగ్గాసాగర్‌కు చెందిన పల్లికొండ ప్రవీణ్, ఎల్ల రవీందర్‌లను పలురకాలుగా ఇబ్బందులకు గురిచేస్తూ డబ్బులు డిమాండ్ చేయడంతో వారు ఏసీబీని ఆశ్రయించి అవినీతి అధికారులను పట్టించారు. ఇందుకు సంబంధించిన వివరాలు ఈ విధంగా ఉన్నాయి. మెట్‌పల్లి మండలం జగ్గసాగర్‌కు చెందిన మత్స్యకార సొసైటీలో నూతన సభ్యులను 50 మందిని సంఘంలోకి తీసుకోడానికి తీర్మానించారు. ఈ విషయాన్ని జిల్లా మత్స్యశాఖ అధికారులకు వినతి పత్రాన్ని అందించి సహకార సంఘంలో నూతనంగా 50మందిని గుర్తించాలని కోరుతూ వినతిప్రతం ఇచ్చారు. జిల్లా మత్స్యశాఖ అధికారి రాణాప్రతాప్‌తో పాటు సీనియర్ అసిస్టెంట్లు నూరొద్దీన్ ఖాజాలు పలుమార్లు సహకార సంఘ బాధ్యులను కార్యాలయం చుట్టూ తిప్పించుకుంటూ పనిచేయకుండా ఇబ్బందులకు గురిచేశారు. ఈ విషయమై జిల్లా అధికారిని పలుమార్లు ప్రాధేయపడగా రూ.80 వేలు ఇస్తేనే సహకార సంఘంలో సభ్యులకు చోటు కల్పిస్తానని తెలిపారు. ఎంతబతిమాలినా మత్స్యశాఖ అధికారులు వినకపోవడంతో రూ.60 వేలకు బేరం కుదుర్చుకున్నారు. ఈ విషయాన్ని ఏసీబీ అధికారులకు తెలిపి పకడ్బందీగా వారిని పట్టించేందుకు సిద్ధపడ్డారు. గురువారం సంఘం సభ్యులు పల్లికొండ ప్రవీణ్, ఎల్ల రవీందర్‌ల నుండి జగిత్యాల మత్స్యశాఖ కార్యాలయంలోని సీనియర్ అసిస్టెంట్ నూరొద్దీన్ ఖాజా రూ.60వేలు తీసుకుంటుండగా దాడి చేసి ఆయనతో పాటు మత్స్యశాఖ జిల్లా అధికారి రాణాప్రతాప్‌ను పట్టుకున్నారు. వీరిద్దరినీ ఆరెస్టు చేసి కరీంనగర్ అనిశా కోర్టులో శుక్రవారం హాజరుపరుచనున్నట్ట్లు ఏసీబీ డీఎస్పీ భద్రయ్య తెలిపారు.