క్రైమ్/లీగల్

అనంతలో దారుణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అనంతపురం, సెప్టెంబర్ 4: అనంతపురం నగర సమీపంలోని కళాకారుల కాలనీలో నివాసముంటున్న భాస్కర్ భార్య శ్రీదేవి తన ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకుంది. ఇద్దరు కుమారులను డ్రైనేజీ నీటి కుంటలోకి తోసేసి తానూ దూకి ఆత్మహత్య చేసుకుంది. బుధవారం మధ్యాహ్నం ఈ విషాద ఘటన వెలుగు చూసింది. వివరాలు ఇలా ఉన్నాయి. కళాకారుల కాలనీలో తోలుబొమ్మలాట కళాకారుడు భాస్కర్, తన భార్య శ్రీదేవి (28), కుమారులు దీక్షిత్(5), యశ్వంత్(4)తో నివాసం ఉంటున్నాడు. భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరిగేవి. ఐదురోజుల క్రితం ఇద్దరూ గొడవపడ్డారు. దీంతో మనస్తాపానికి గురైన శ్రీదేవి, తన ఇద్దరు కుమారులతో సహా ఇంటి నుంచి వెళ్లిపోయింది. కాలనీ దగ్గరలోని డ్రైనేజీ నీటి కుంటలో పిల్లలిద్దరినీ తోసేసి, తాను అందులో పడి ఆత్మహత్య చేసుకుంది. బుధవారం మూడు మృతదేహాలు కుంటలో తేలడంతో గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు ముగ్గురి మృతదేహాలను వెలికితీసి ఆసుపత్రికి తరలించారు. కేసు దర్యాప్తులో ఉంది. భర్తే తన భార్య, పిల్లల్ని హత్య చేసి నీటికుంటలో పడేసి ఉంటాడన్న కోణంలో దర్యాప్తు చేపట్టారు.