క్రైమ్/లీగల్

దంపతుల ఆత్మహత్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నూజివీడు, ఫిబ్రవరి 11: ఏ కష్టం వచ్చిందో, ఏ ఇబ్బంది వచ్చిందో, ఎవరికీ చెప్పకుండా, ఆత్మహత్యకు ఎవరూ కారణం కాదని, ఆర్ధిక పరిస్ధితుల వల్లే ఆత్మహత్య చేసుకుంటున్నామని పేర్కొంటూ జీవితాంతం కలసి ఉండాల్సిన దంపతులు, ఇద్దరు కలసి ఆదివారం ఉదయం ఆత్మహత్యకు పాల్పడ్డారు. నూజివీడు మండలం పల్లెర్లమూడి గ్రామానికి చెందిన కలిదిండి నాగార్జున ఆటో డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. పెడన మండల బల్లిపర్రు గ్రామానికి చెందిన భవానీతో ఏప్రిల్ 4, 2017న వివాహం జరిగింది. ప్రస్తుతం భవానీ ఆరు నెలల గర్భవతి. నాగార్జున ఆటో డ్రైవర్‌గా పనిచేస్తుండగా, భవానీ గ్రామంలో ఆరోగ్య కార్యకర్తగా పనిచేస్తోంది. శనివారం ఏరియా వైద్యశాలలో భవానీకి వైద్యపరీక్షలు నిర్వహించారు. ఇంతలో ఏం జరిగిందో.. ఏమో తెలియదు. ఆదివారం ఉదయం భార్త్భర్తలు ఇరువురు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. డబ్బు చాలా అవసరం, డబ్బు లేనిదే జీవితం లేదు. మా ఆత్మహత్యలకు ఎవరూ కారణం కాదు. మేమే ఇద్దరం అనుకుని ఆత్మహత్య చేసుకుంటున్నాం అంటూ రాసిన లేఖలు పోలీసులకు దొరికాయి. కుటుంబ కలహాలు, లేదా వ్యక్తిగత కారణాల వల్ల వీరు ఆత్మహత్య చేసుకుని ఉండవచ్చని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పలు కోణాలలో కేసు దర్యాప్తు చేస్తామని రూరల్ ఎస్‌ఐ చిరంజీవి తెలిపారు. మృతదేహాలను పోస్టుమార్టం కోసం నూజివీడు ఏరియా వైద్యశాలకు తరలించారు.