క్రైమ్/లీగల్

సత్య నాదెళ్లకు పితృవియోగం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 13: మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్యనాదెళ్ల తండ్రి, 1962 బ్యాచ్‌కు చెందిన విశ్రాంత సీనియర్ ఐఎఎస్ అధికారి బిఎన్ యుగంధర్ (82) శుక్రవారం నాడు హైదరాబాద్‌లో కన్నుమూశారు. కొద్ది రోజులుగా స్వల్ప అస్వస్థతతో బాధపడుతున్న యుగంధర్ ఆస్పత్రిలోనే కన్నుమూశారు. నిజాయితీ పరుడిగా , పేదల పక్షపాతిగా, దేశంలో వికలాంగుల సంక్షేమానికి కృషి చేసిన అధికారిగా యుగంధర్ పేరుగడించారు. యుగంధర్ మృతి పట్ల తెలంగాణ సీఎం కే చంద్రశేఖరరావు, ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్‌రెడ్డి వేర్వేరు ప్రకటనల్లో తీవ్ర దిగ్భ్రాంతిని , సంతాపాన్ని వ్యక్తం చేశారు. తెలంగాణ సీఎస్ డాక్టర్ ఎస్‌కే జోషి, తెలంగాణ ఐఎస్‌ఎస్ అధికారుల సంఘం అధ్యక్షుడు బీపీ ఆచార్య, కేంద్ర హోం శాఖ మాజీ కార్యదర్శి కే పద్మనాభయ్య తదితరులు యుగంధర్ మృతి పట్ల దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. మన్మోహన్‌సింగ్ ప్రభుత్వ హయాంలో ప్రణాళికాసంఘం సభ్యుడిగా యుగంధర్ వ్యవహరించారు. ప్రధాని కార్యదర్శిగానూ, ముస్సోరిలోని లాల్ బహుదూర్ ఐఎఎస్ అకాడమి డైరెక్టర్‌గా సేవలు అందించారు. సమర్థమైన, అత్యుత్తమ ప్రజాసేవకుడైన ఐఏఎస్‌గా ఆయన పేరుపొందారు. పీవీ నరసింహరావు ప్రధానిగా ఉన్నపుడు గ్రామీణాభివృద్ధి శాఖలో పెను సంచలన సంస్కరణలకు యుగంథర్ శ్రీకారం చుట్టారు. ఆ సమయంలోనే వాటర్‌షెడ్‌ల అభివృద్ధికి రాష్ట్రాలతో సంబంధం లేకుండా కేంద్రం నుండి నేరుగా జిల్లాలకు నిధులు వచ్చేలా మార్గదర్శకాలను రూపొందించారు. మరో సీనియర్ ఐఎఎస్ అధికారి కేఆర్ వేణుగోపాల్‌కు యుగంధర్ మంచి మిత్రులు, పీవీ నరసింహరావు ప్రధానిగా ఉన్న సమయంలో యు గంధర్ గ్రామీణాభివృద్ధికి, కేఆర్ వేణుగోపాల్ సంక్షేమ శాఖకు పనిచేస్తూ అనేక సం స్కరణలకు శ్రీకారం చుట్టారు. అనంతరం యుగంధర్ తన కుమారుడు సత్యనాదెళ్లకు కేఆర్ వేణుగోపాల్ కుమార్తెను ఇచ్చి వివాహం చేశారు. అనంతపురం జిల్లా యల్లనూరు మండలం బుక్కాపురాన్ని దత్తత తీసుకుని గ్రామాభివృద్ధికి పాటుపడ్డారు.