క్రైమ్/లీగల్

370 రద్దు సవాల్ పిటిషన్లపై నేడు సుప్రీం విచారణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 15: జమ్మూకాశ్మీర్‌కు సంబంధించి కీలక కేసులను సుప్రీంకోర్టు సోమవారం విచారించనుంది. 370 అధికరణ రద్దు, రాష్టప్రతి పాలన విధింపు రాజ్యాంగబద్ధత, ఆంక్షలు తదితర అంశాలపై దాఖలైన పిటిషన్లను ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగోయ్, న్యాయమూర్తులు ఎస్‌ఏ బాబ్డే, ఎస్ అబ్దుల్ నజీర్‌తో కూడిన రాజ్యాంగ బెంచ్ విచారిస్తుంది. ఈ పిటిషన్లలో తన కుటుంబ సభ్యులను చూసేందుకు అనుమతించాలంటూ కాంగ్రెస్ నాయకుడు గులాం నబీ ఆజాద్ దాఖలు చేసిన అప్పీలు కూడా ఉంది. 370 అధికరణ రద్దు తర్వాత రెండుసార్లు కాశ్మీర్ వెళ్లేందుకు ప్రయత్నించిన ఆజాద్‌ను పోలీసులు విమానాశ్రయం నుంచే వెనక్కి పంపేసిన విషయం తెలిసిందే. ఇప్పటికైనా తన కుటుంబ సభ్యులను చూసేందుకు అనుమతించాలని సుప్రీంకోర్టును ఆజాద్ అభ్యర్థించారు. అలాగే, 370 అధికరణ రద్దు, రాష్ట్ర పునర్విభజన బిల్లు చెల్లుబాటును సవాల్ చేస్తూ సజ్జద్ లోన్ సారథ్యంలోని పీపుల్స్ కాన్ఫరెన్స్ పార్టీ సుప్రీంలో పిటిషన్ వేసింది. ప్రత్యేక హోదాను రద్దు చేసినప్పటినుంచి కాశ్మీర్‌లో పిల్లలను అక్రమంగా నిర్బంధించారని అరోపిస్తూ బాలల హక్కుల కార్యకర్తలు ఇనాక్షి గంగూలీ, ప్రొఫెసర్ శాంతి సిన్హా కూడా పిటిషన్ దాఖలు చేశారు. అలాగే రాజ్యసభ సభ్యుడు, ఎండీఎంకే నాయకుడు వైగో దాఖలు చేసిన పిటిషన్ కూడా నేడు విచారణకు రాబోతోంది. గృహ నిర్బంధంలో ఉన్నట్టు చెబుతున్న ఫరూక్ అబ్దుల్లాను వెంటనే కోర్టు ముందు హాజరుపరచాలని ఆదేశించాలంటూ వైగో తన పిటిషన్‌లో కోరారు. తన సహచరుడు యూసుఫ్ తరిగామిని పరామర్శించేందుకు అనుమతించాలని సీపీఎం నాయకుడు సీతారాం ఏచూరి దాఖలు చేసిన పిటిషన్ కూడా లిస్టింగ్‌లో ఉంది. తరిగామిని పరామర్శించేందుకు ఏచూరిని సుప్రీం అనుమతించినప్పటికీ కొన్ని షరతులు విధించింది.