క్రైమ్/లీగల్

ప్యాపిలిలో భగ్గుమన్న పాతకక్షలు..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

డోన్, ఫిబ్రవరి 11 : నియోజకవర్గ పరిధిలోని మండల కేంద్రమైన ప్యాపిలిలో మరోసారి పాతకక్షలు భగ్గుమన్నాయి. వ్యక్తిగత కక్షలతో ఓ యువకుడిని దారుణంగా నరికి చంపారు. ప్యాపిలి పట్టణానికి చెందిన బోయ మధు అలియాస్ బంగి మధు(32)పై ప్రత్యర్థులు ఆదివారం తెల్లవారుజామున వేటకొడళ్లతో దాడి చేసి దారుణంగా చంపారు. పోలీసులు తెలిపిన వివరాలు.. ప్యాపిలి పట్టణంలో నాటుసారా అమ్మకాల విషయంలో బోయ లక్ష్మీనారాయణ, నరసింహులు మధ్య విభేదాలు ఉన్నాయి. దీంతో తరచూ వారి మధ్య జరుగుతున్న గొడవలు చిలికి చిలికి పెద్దవయ్యాయి. దీంతో 2010లో బోయ లక్ష్మీనారాయణను గ్రామంలోని సినిమా థియేటర్ వద్ద దారుణంగా హత్య చేశారు. ఈ హత్య కేసులో మధు కూడా నిందితుడు. అయితే ఆ కేసులో సాక్ష్యాధారాలు బలంగా లేకపోవడంతో ఇటీవలే కోర్టు ఆ కేసును కొట్టి వేసింది. దీంతో లక్ష్మీనారాయణ వర్గీయుల్లో తీవ్ర ఆవేశాలు చెలరేగాయి. గత రెండు రోజులుగా ప్యాపిలిలో జరుగుతున్న తిరుణాల ఉత్సవాల సందర్భంగా శనివారం రాత్రి సంబరాలు చేసుకుని ఇంటికి వస్తున్న బోయ మధు అలియాస్ బంగి మధును ప్రత్యర్థులు పథకం ప్రకారం దాడి చేసి దారుణంగా హత్య చేశారు. వేటకొడవళ్లతో తలపై నరకడంతో మధు అక్కడికక్కడే మృతిచెందారు. ఈ హత్యకు వ్యిక్తిగత కక్షలే కారణమని పోలీసులు భావిస్తున్నారు. గతంలో హత్యకు గురైన లక్ష్మీనారయణ, బోయ మధు దగ్గరి బంధువులే కావడం విశేషం. సారా విక్రయం విషయంలో ఏర్పడిన విభేదాలే హత్యలకు దారి తీశాయని, రాజకీయ కారణాలేమీ లేవని డీఎస్పీ బాబాఫకృద్దీన్ స్పష్టం చేశారు. విషయం తెలిసిన వెంటనే డీఎస్పీ సంఘటనా స్థలాన్ని సందర్శించారు. మధు హత్య కేసులో నరసింహులుతో పాటు 11 మందిపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ప్యాపిలి పట్టణంలో పాతకక్షలతో హత్య జరగడంతో గ్రామస్థులు ఆందోళన చెందుతున్నారు. డోన్, ప్యాపిలి, బనగానపల్లె సీఐలతో పాటు ఎస్‌ఐలు బందోబస్తును పర్యవేక్షిస్తున్నారు. మధు సోదరుడు పాండు ఫిర్యాదు మేరకు ప్యాపిలి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. నిందితుల కోసం గాలిస్తున్నామని త్వరలోనే పట్టుకుంటామని డీఎస్పీ తెలిపారు.