క్రైమ్/లీగల్

ఏటీఎంలో చోరీకి విఫలయత్నం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సనత్‌నగర్, సెప్టెంబర్ 19: ఫత్తేనగర్‌లోని ఓ ఏటీఎంలో నగదును దొంగిలించేందుకు విఫలయత్నం చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఫత్తేనగర్ బ్రిడ్జ్ క్రింద యాక్సిక్ బ్యాంక్ ఆటోమెటిక్ టెల్లర్ మిషన్ (ఏటీఎం) ద్వంసం చేసి అందులోని నగదును ఎత్తుకెళ్లేందుకు గుర్తుతెలియని వ్యక్తులు విఫలయత్నం చేశారు. ఏటీఎం సెంటర్‌లోకి ప్రవేశించిన చోరులు తమతో తెచ్చుకున్న భారీ ఇనుప రాడ్ సహాయంతో మిషన్ తెరిచేందుకు యత్నించారు. ఈ ప్రయత్నంలో యంత్రానికి ఏర్పాటు చేసిన కవర్‌ను మాత్రమే తెరవగలిగారు. నగదును నిల్వల చేసిన భాగాన్ని తెరిచేందుకు ప్రయత్నించగా సాధ్యపడలేదు. చాలా సేపు కుస్తీపట్టిన చోరులు కుదరక పోవడంతో వెళ్లిపోయారు. గురువారం ఉదయం నగదును తీసుకునేందుకు వెళ్లిన ఖాతాదారులు.. ఏటీఎం మిషన్ పాక్షికంగా తెరిచి ఉండటాన్ని గమనించి పోలీసులకు సమాచారం అందించారు. హుటాహుటిన అక్కడికి చేరుకున్న సనత్‌నగర్ పోలీసులు బ్యాంక్ అధికారులను రప్పించి పరిశీలించగా నగదు చోరీకి గురికాలేదని నిర్దారించారు.
సీసీ పుటేజీలను పరిశీలించగా గురువారం తెల్లవారుఝామున సుమారు 2:30 ప్రాంతంలో గుర్తుతెలియని వ్యక్తులు ఏటీఎం సెంటర్‌లోకి పొడవాటి ఇనుప కడ్డీతో ప్రవేశించినట్టు గుర్తించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.