క్రైమ్/లీగల్

చేతబడి అనుమానంతో చంపి.. కాల్చేశారు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శామీర్‌పేట, సెప్టెంబర్ 19: మూఢ నమ్మకాలతో మహానగరం శివారులో మరో దారుణం చోటు చేసుకుంది. చంద్రునిపై కాలు మోపేందుకు సిద్ధమవుతున్న నేటి ఆధునిక యుగంలో మూఢాచారాలు నమ్మే మనుషుల్లో మానవత్వం పత్తాలేకుండా పోతోంది. అనారోగ్యంతో బాధపడుతూ ఓ మహిళా మృతి చెందగా, స్థానిక యువకుడు చేసిన చేతబడితోనే ఆ మహిళా మృతి చెందిందంటూ మృతురాలి కుటుంబం అనుమానించి యువకుడ్ని కొట్టి చంపేసి, మహిళ చితిలోనే వేసి దహనం చేసిన అమానవనీయ ఘటన శివారులోని శామీర్‌పేట సమీపంలోని అద్రాసుపల్లి గ్రామంలో చోటుచేసుకుంది. రాష్టవ్య్రాప్తంగా సంచలనం సృష్టించిన ఈ ఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. శామీర్‌పేట అద్రాసుపల్లిలో నివాసముంటున్న లక్ష్మీ అనే మహిళా గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతోంది. పరిస్థితి విషమించి ఆమె బుధవారం మృతి చెందగా, అదే రోజు రాత్రి కాస్త ఆలస్యమైనా ఆమె మృతదేహాన్ని కాష్టం చేశారు. అప్పటికే లక్ష్మీ మృతిపై అనేక అనుమానాల వ్యక్తం చేస్తున్న ఆమె కుటుంబ సభ్యులు లక్ష్మీ చితి కాలుతుండగా, అక్కడే స్థానిక యువకుడు ఆంజనేయులు (24) సంచరించటం కన్పించింది. దాంతో ఆంజనేయులే చేతబడి చేసి లక్ష్మీని చేంపేశాడని అనుమానించిన లక్ష్మీ కుటుంబం మూకుమ్మడిగా ఆంజనేయులను మారణాయుధాలతో, కర్రలతో విచక్షణ రహితంగా కొట్టడం ప్రారంభించారు. తనకేమీ తెలియదంటూ ఆంజనేయులు మొత్తుకున్నా, వారు వినకుండా చంపేశారు. అప్పటికీ కాలుతున్న లక్ష్మీ చితిలోనే ఆంజనేయులు మృతదేహాన్ని పారవేసి కాల్చేశారు. అరపులు, కేకలతో ఆంజనేయులను కొట్టి చంపటంతో ఊరంత ఉద్రిక్తత చోటు చేసుకుంది. తెల్లవారుఝమునే లక్ష్మీ చితిపై మరో యువకుడి మృతదేహం కాలుతుండటాన్ని గమనించిన పలువురు స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే రంగంలో దిగిన డీసీపీ పద్మజ, ఏసీపీ నర్సింహారావు, ఇన్‌స్పెక్టర్ నవీన్‌రెడ్డి, తహశీల్దార్ గోవర్ధన్ ఘటనా స్థలానికి చేరుకుని, అప్పటికే సగం కాలిన ఆంజనేయులు మృతదేహాన్ని వైద్య పరీక్షలు, డీఎన్‌ఏ పరీక్ష కోసం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు.
వదంతులే కారణమా?
అద్రాసుపల్లిలో నివాసముండే ఆంజనేయులు టెన్త్ వరకు చదువుకుని, ఆటోడ్రైవర్‌గా జీవనం గడుపుతున్నాడు. అయితే ఆంజనేయులు కుటుంబం చేతబడి చేస్తుందంటూ కొంతకాలంగా ఆ గ్రామంలో విన్పిస్తున్న వదంతులే ఈ అమానుషమైన ఘటనకు కారణమా? అన్న వాదనలు సైతం విన్పిస్తున్నాయి. లక్ష్మీ కాష్టం వద్ద ఆంజనేయులు సంచరిస్తుండటంతో మృతురాలి కుటుంబానికి, గ్రామస్థులకు అప్పటి వరకున్న అనుమానం మరింత బలపడటంతోనే ఇంతటి దారుణం చోటుచేసుకుందని చెప్పవచ్చు.

*చిత్రం...ఘటనా స్థలంలో క్లూస్‌టీం పరిశోధన
* మృతుడు ఆంజనేయులు (ఫైల్‌ఫొటో)