క్రైమ్/లీగల్

ఎన్-ఆగ్రోఫామ్‌లో అస్థిపంజరం లభ్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

షాద్‌నగర్ టౌన్, సెప్టెంబర్ 19: ఎన్-ఆగ్రోఫామ్‌లో గుర్తు తెలియని అస్తిపంజరం లభ్యమైంది. రంగారెడ్డి జిల్లా కేశంపేట మండలం పాపిరెడ్డిగూడ గ్రామ శివారులోని ఎన్-ఆగ్రోఫామ్‌లో చోటు చేసుకున్న సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సినీ నటుడు అక్కినేని నాగార్జునకు సంబంధించినదిగా భావిస్తున్న ఫాం హౌజ్‌లో ఈసంఘటన చోటుచేసుకుంది. బుధవారం రాత్రి పాపిరెడ్డిగూడ గ్రామ శివారులోని ఎన్-ఆగ్రోఫామ్ హౌజ్‌లోని ఒక గదిలో సుమారు 30ఏళ్ల యువకుడు ఆత్మహత్య చేసుకున్నట్లు, కేవలం అస్తిపంజరాలు మాత్రమే ఉన్నాయని అక్కడ పనిచేసేందుకు వచ్చిన కూలీలు చూసి కేశంపేట పోలీసులకు సమాచారం ఇచ్చారు. కేశంపేట ఎస్‌ఐ వెంకటేశ్వర్లు తమ సిబ్బందితో ఘటన స్థలానికి చేరుకొని ఎన్ ఆగ్రోఫామ్ హౌజ్‌లో ఉన్న గదిలో పరిశీలించారు. గురువారం ఉదయం పాపిరెడ్డిగూడ గ్రామ శివారులో ఉన్న ఎన్-ఆగ్రోఫామ్ హౌజ్‌ను శంషాబాద్ డీసీపీ ప్రకాష్‌రెడ్డి సందర్శించి గుర్తు తెలియని వ్యక్తి అస్తిపంజరాన్ని పరిశీలించారు. ఘటన స్థలం వద్దనే అస్తిపంజరానికి శవ పరీక్ష చేయడమే కాకుండా ఫోరెన్సిక్ నిపుణులు పరీక్షల నిమిత్తం శ్యాంపిళ్లను తీసుకువెళ్లారు. ఈ సందర్భంగా శంషాబాద్ డీపీసీ ప్రకాష్‌రెడ్డి మాట్లాడుతూ సుమారు 30సంవత్సరాల వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడని, ఎలా చేసుకున్నాడు..ఎందుకు చేసుకున్నాడనే విషయాలపై విచారణ చేస్తున్నామని, మృతుడు ఈ ప్రాంతానికి చెందిన వ్యక్తియేనా..లేక కూలీ పనికోసం వచ్చి ఆత్మహత్య చేసుకున్నాడా అనే కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామని వివరించారు. కానీ స్థానికులు మాత్రం పాపిరెడ్డిగూడ గ్రామానికి చెందిన చాకలి పాండు అని చెబుతుండటంతో ఆ దిశగా కూడా దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. అస్తిపంజరాన్ని పాపిరెడ్డిగూడలో నివాసం ఉంటున్న కుటుంబ సభ్యులకు పోలీసులు అప్పగించారు. అన్ని కోణాల్లో ఘటనపై దర్యాప్తు చేసిన తరువాతే పూర్తి వివరాలను వెల్లడించనున్నట్లు శంషాబాద్ డీసీపీ ప్రకాష్‌రెడ్డి వివరించారు. పాపిరెడ్డిగూడ గ్రామ వీఆర్‌ఓ మమత ఇచ్చిన ఫిర్యాదుపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. ఎన్-ఆగ్రో ఫామ్‌హౌజ్‌లో గుర్తు తెలియని అస్తిపంజరం లభించడంతో పాపిరెడ్డిగూడ గ్రామంలో కలకలం రేపుతోంది. సంఘటన జరిగి ఏళ్లు గడుస్తున్నట్లు ప్రాథమిక నిర్దారణకు వచ్చారు. అలాగే ఆత్మహత్య చేసుకుంటున్నట్లు ఇంట్లో రాసిన లేఖను కూడా పోలీసులు స్వాధీనపరుచుకున్నారు. ఆధారాలు పరిశీలించి వివరాలు వచ్చాక పూర్తి సమాచారం అందిస్తామన్నారు.

*చిత్రం...ఆగ్రోఫాం, (ఇన్‌సెట్‌లో) వ్యక్తి అస్థిపంజరం