క్రైమ్/లీగల్

సీనియారిటీ జాబితాకు రోస్టర్ పనికిరాదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 19: సీనియారిటీ జాబితా రూపకల్పనకు రోస్టర్ పాయింట్లు పనికిరావని, మెరిట్ ప్రాతిపదిక గానే సీనియారిటీ జాబితాను రూపొందించాలని హైకోర్టు స్పష్టం చేసింది. తెలంగాణ, ఆంధ్రా రాష్ట్రాలకు వైద్య విధాన పరిషత్ జూనియర్ స్టెనోగ్రాఫర్ ఉద్యోగాలకు రూపొందించిన సీనియారిటీ జాబితాలపై అభ్యంతరాలు వ్యక్తం కావడంతో హైకోర్టు ఈ ఆదేశాలు ఇచ్చింది. ఏపీ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన నోటిఫికేషన్‌ను వ్యతిరేకిస్తూ దాఖలైన పిటిషన్‌ను విచారించిన జస్టిస్ పీవీ సంజయ్ కుమార్, జస్టిస్ కే లక్ష్మణ్‌లతో కూడిన ధర్మాసనం ఈ మేరకు ఉత్తర్వులు ఇచ్చింది. తక్షణమే మెరిట్ ఆధారంగానే సీనియారిటీ జాబితాను రూపొందించాలని దర్మాసనం పేర్కొంది. జూనియర్ స్టెనోగ్రాఫర్ల ఉద్యోగాలకు ఎంపికైన వారి సీనియారిటీ జాబితాను రోస్టర్ పాయింట్లు ఆధారంగా రూపొందించడంపై అభ్యంతరాలు వచ్చాయి. ఏపీ రాష్ట్ర పునర్విభజన చట్టం ఆధారంగా ఏపీ ప్రభుత్వమే ఇరు రాష్ట్రాలకు అభ్యర్ధులను కేటాయించింది. అనంతరం ఇరు రాష్ట్రాల కమిషనర్లు రెండు సీనియారిటీ జాబితాలను రూపొందించారు. ఏపీ జాబితాలో రెండో స్థానంలో ఉన్న అభ్యర్థిని పిటిషన్ దాఖలు చేస్తూ తనకంటే ఎంపిక పరీక్షలో తక్కువ మార్కులు వచ్చిన అభ్యర్థి ప్రధమ స్థానంలో ఉన్నారని పేర్కొన్నారు. పిటిషనర్ తరఫున సీహెచ్ గణేష్ వాదనలు వినిపించారు.
కోడెల మృతిపై పిటిషన్
ఆంధ్రప్రదేశ్ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్ ఆత్మహత్య ఘటనపై సీబీఐ దర్యాప్తునకు ఆదేశించాలని కోరుతూ కోడెల అభిమానులు హైకోర్టును ఆశ్రయిస్తున్నారు. వారి తరఫున అనిల్ బూరగడ్డ శుక్రవారం నాడు తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయనున్నట్టు తెలిసింది.