క్రైమ్/లీగల్

ముందస్తు బెయిల్ ఇవ్వండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కోల్‌కతా, సెప్టెంబర్ 20: శారదా చిట్‌ఫండ్ కుంభకోణం కేసులో అరె స్టు నుంచి తప్పించుకోవడానికి కోల్‌కతా మాజీ పోలీసు కమిషనర్ రాజీ వ్ కుమార్ శుక్రవారం అలీపూర్ జిల్లా, సెషన్స్ కోర్టును ఆశ్రయించారు. ముందస్తు బెయిల్ కోసం పిటిషన్ దాఖలు చేశారు. శారదా చిట్‌ఫండ్ కుంభకోణం కేసులో రాజీ వ్ కుమార్‌ను అరెస్టు చేయడానికి వారెంట్ అవసరం లేదని అలీపూర్ కోర్టులోని అదనపు చీఫ్ జ్యుడీషియ ల్ మేజిస్ట్రేట్ (ఏసీజేఎం) గురువా రం స్పష్టం చేయడంతో రాజీవ్ కుమార్ శుక్రవారం ముందస్తు బెయి ల్ కోసం పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ శనివారం విచారణకు వచ్చే అవకాశం ఉందని రాజీవ్ కుమార్ తరపు న్యాయవాది గోపాల్ హల్దార్ తెలిపారు.
శారదా చిట్‌ఫండ్ కుంభకోణం కేసులో రాజీవ్ కుమార్‌ను అరెస్టు చేయకుండా విధించిన ఆదేశాలను సుప్రీంకోర్టు, కోల్‌కతా హైకోర్టు ఇదివరకే ఎత్తివేయడంతో అతడిని అరెస్టు చేయడానికి వారెంట్ అవసరం లేదని ఏసీజేఎం గురువారం స్పష్టం చేశారు.
సీబీఐ రాజీవ్ కుమార్‌పై చట్ట ప్రకారం చర్య తీసుకోవచ్చని కూడా ఏసీజేఎం పేర్కొన్నారు. రాజీవ్ కుమార్ ప్రస్తుతం పశ్చిమ బెంగాల్ సీఐడీ అదనపు డైరెక్టర్ జనరల్‌గా పనిచేస్తున్నారు.