క్రైమ్/లీగల్

కడప ఆర్టీఓ కార్యాలయంపై ఏసీబీ దాడులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కడప, సెప్టెంబర్ 20: కడప ఆర్టీఓ కార్యాలయంపై శుక్రవారం ఏసీబీ అధికారులు దాడులు జరిపారు. ఏసీబీ డిఎస్పీ ఎం.నాగభూషణం సిబ్బందితో కలిసి ఉదయం 11 గంటలకు ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించారు. ఆ సమయంలో అక్కడే ఉన్న 15 మంది ప్రైవేట్ ఏజెంట్లను అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి రూ.90,310 నగదును స్వాధీనం చేసుకున్నారు. వారికి సహకరించిన 17 మంది కార్యాలయం సిబ్బందిని సైతం అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.