క్రైమ్/లీగల్

మాజీ ఎంపీ శివప్రసాద్ ఆరోగ్యం విషమం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చిత్తూరు, సెప్టెంబర్ 20 : చిత్తూరు మాజీ ఎంపీ డాక్టర్ ఎన్.శివప్రసాద్ ఆరోగ్యం విషమించింది. కిడ్నీవ్యాధితో బాధపడుతున్న ఆయనను వారం రోజుల కిందట మెరుగైన చికిత్స కోసం చెన్నై అపోలో వైద్యశాలకు తరలించారు. అక్కడ అత్యవసర విభాగంలో వెంటిలేటర్ సాయంతో చికిత్స పొందుతున్నారు. శుక్రవారం ఆయన ఆరోగ్య పరిస్థితి మరింత విషమించడంతో టీడీపీ జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు చెన్నై అపోలో వైద్యశాలకు వెళ్లి శివప్రసాద్ కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఆయనకు అందిస్తున్న వైద్యసేవలను అడిగి తెలుసుకున్నారు. టీడీపీకి చెందిన పలువురు ముఖ్య నాయకులు, జిల్లా నాయకులు సైతం చెన్నై అపోలో వైద్యశాలకు వెళ్లి మాజీ ఎంపీ ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.