క్రైమ్/లీగల్

ఇంకా 16మంది...

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజమహేంద్రవరం, సెప్టెంబర్ 20: తూర్పు గోదావరి జిల్లా దేవీపట్నం మండలం కచ్చులూరుమందం వద్ద గత ఆదివారం సంభవించిన బోటు ప్రమాదానికి సంబధించి శుక్రవారం ఒక మహిళ మృతదేహం లభించింది. గాలింపు చర్యలో భాగంగా మహిల మృతదేహాన్ని గుర్తించారు. కచ్చులూరు వద్ద లభించిన ఈ మృతదేహాన్ని విశాఖ జిల్లా గోపాలపురానికి చెందిన మదుపాక అరుణకుమారి (38)గా నిర్ధారించారు. బోటు ప్రమాదానికి సంబంధించి అధికారిక లెక్కల ప్రకారం గురువారం వరకు 13మంది జాడ తెలియాల్సివుండగా, శుక్రవారం ఒక మృతదేహం లభించాక కూడా ఈ సంఖ్య 16కు చేరింది. ప్రమాద సమయంలో బోటులో ఎంతమంది ఉన్నారనే విషయమై వివాదం కొనసాగుతూనేవుంది. ప్రమాద సమయంలో అధికారులు ప్రకటించినట్టు 73 మంది కంటే ఎక్కువమంది బోటులో ఉన్నారని గురువారం నుండి వార్తలు వెలువడుతున్న సంగతి విదితమే. మాజీ ఎంపీ హర్షకుమార్ ఈ సంఖ్య 93 అని సంచలన ప్రకటనచేశారు. ఈ నేపథ్యంలో శుక్రవారం ప్రభుత్వాసుపత్రి వద్ద విలేఖర్లతో మాట్లాడిన మంత్రి కన్నబాబు బోటులో 77 మంది ఉండవచ్చని ప్రకటించారు. దీనితో అధికారికంగానే ఈ సంఖ్య మరో నాలుగుకు పెరిగింది. బోటులో విహారయాత్రకు తల్లిదండ్రులతో కలిసివచ్చిన పిల్లలను లెక్కించలేదనే సందేహం వ్యక్తమవుతోంది. ప్రమాదం సంభవించి శుక్రవారానికి ఆరు రోజులయ్యింది. 16మంది జాడ తెలియాల్సివున్నా, మృతదేహాల కోసం జరుపుతున్న గాలింపుచర్యలు నిరాశాజనకంగా ఉంటున్నాయి. దీనితో మునిపోయిన బోటులో కొన్ని మృతదేహాలు ఉండవచ్చని భావిస్తున్నారు. కనీసం తమ అప్తుల అస్తిపంజరం అయినా ఇప్పించాలని బాధిత కుటుంబాలవారు శుక్రవారం రాజమహేంద్రవరం ప్రభుత్వాసుపత్రికి వచ్చిన మంత్రి కన్నబాబును వేడుకోవడం కనిపించింది.
బోటు వెలికితీతపై సందేహాలు...
గోదావరిలో మునిగిపోయిన బోటును వెలికితీసే ప్రక్రియ పకడ్బందీగా సాంకేతికంగా మొదలుకాలేదు. ఆరు రోజులు కావస్తున్నా ఇంకా బోటు ఎంత లోతులో ఉండవచ్చు, తీయడం ఎలా అనే విషయాలపైనే మల్లగుల్లాలు పడుతున్నారు. వివిధ ప్రాంతాల నుండి వచ్చిన నిపుణులు తమ తమ అంచనాలను వెల్లడించి, వెళ్లిపోయారు. నదిలో 200 నుండి 300 అడుగుల లోతులో బోటు ఉండవచ్చని మాత్రం స్పష్టమవుతోంది. అయితే తీవ్ర ప్రతికూల పరిస్థితులు నెలకొనివున్న నేపథ్యంలో అసలు బోటు వెలికితీయడం సాధ్యమవుతుందా అనే సందేహాలు రోజు రోజుకూ బలపడుతున్నాయి. శుక్రవారం ఉదయం నుంచి వెలికితీసే ప్రయత్నం జోలికి వెళ్లలేదని తెలుస్తోంది. ప్రమాదం జరిగిన కచ్చులూరులో 144 సెక్షన్ విధించి గ్రామస్థులను ఆ ప్రాంతానికి వెళ్లకుండా చర్యలుచేపట్టారు. కాకినాడ పోర్టు నుంచి తీసుకొచ్చిన నిపుణుడు ధర్మాడ సత్యం బృందం దేవీపట్నంలోనే ఉండిపోయింది. ముంబయికి చెందిన నేవీ నిపుణుడు భక్షీ నెదర్లాండ్ బృందంతో చర్చించి, రెండు రోజుల్లో వస్తారని తెలుస్తోంది.