క్రైమ్/లీగల్

ఎట్టకేలకు చిన్మయానంద అరెస్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

షాజహన్‌పూర్, సెప్టెంబర్ 20: న్యాయవాద కళాశాల విద్యార్థినిపై అత్యాచారానికి పాల్పడిన ఆరోపణ కేసులో బీజేపీ నాయకుడు, కేంద్ర మాజీ మంత్రి స్వామి చిన్మయానందను ఉత్తర్ ప్రదేశ్ ప్రత్యేక పరిశోధన బృందం (సిట్) శుక్రవారం అరెస్టు చేసింది. చిన్మయానందను స్థానిక కోర్టులో హాజరుపరచగా చీఫ్ జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ ఆయన్ను 14 రోజుల జ్యుడిషియల్ కస్టడీకి అప్పగించారు. శుక్రవారం ఉదయం 8.30 గంటల ప్రాంతంలో భారీ పోలీసుల మోహరింపుతో, కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య ప్రత్యేక పరిశోధన బృందం (సిట్) పోలీసులు చిన్నయానంద ఆశ్రమానికి చేరుకుని ఆయన్ను అరెస్టు చేశారు. ఆ వెంటనే ఆయన్ను కోర్టుకు తీసుకెళ్ళి చీఫ్ జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ ఎదుట హాజరుపరచడంతో జ్యుడిషియల్ కస్టడీకి అప్పగించినట్లు స్థానిక పోలీసులు తెలిపారు. స్వామి చిన్మయానందతో పాటు మరో ముగ్గురినీ అరెస్టు చేసినట్లు చెప్పారు. బలవంతంగా డబ్బులు వసూలు చేసినందుకు వీరిని అరెస్టు చేసినట్లు వారు తెలిపారు. చిన్మయానందను అరెస్టు చేసిన తర్వాత కోర్టులో హాజరుపరచడానికి ముందుగా వైద్య పరీక్షలు చేయించినట్లు చెప్పారు. కోర్టు ఆదేశం మేరకు జైలుకు పంపించినట్లు డీజీపి ఓపీ సింగ్ మీడియాకు తెలిపారు. అత్యాచార ఆరోపణల నేపథ్యంలో స్వామి చిన్మయానందను అరెస్టు చేసినట్లు ఆయన చెప్పారు. చిన్మయానంద తన ఇనిస్టిట్యూట్‌ను జైలు తరహాలో నిర్భంధించే వారని, లైంగిక సంపర్కం చేసిన ఆరోపణలు వచ్చాయని ఆయన తెలిపారు. చిన్మయానంద నిర్వహిస్తున్న ఇనిస్టిట్యూట్‌లో పోస్టు గ్రాడ్యుయేట్ విద్యార్థినిపై అత్యాచారానికి పాల్పడినట్లు గత నెలలో ఆరోపణ వచ్చినట్లు చెప్పారు. దీంతో ఏ మాత్రం జాప్యం చేయకుండా ‘సిట్’ విచారణ చేపట్టిందన్నారు. తనపై అత్యాచారం జరిగిందని, లైంగికంగా వేధించారని ఆరోపించిన విద్యార్థిని పలు వీడియో క్లిప్పింగ్‌లను కూడా పోలీసులకు అప్పగించినట్లు ఆయన తెలిపారు. ఈ మేరకు ఆ వీడియో క్లిప్పింగ్‌లను ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపించినట్లు డీజీపి సింగ్ చెప్పా రు. ఆ విద్యార్థిని ఇచ్చిన పెన్ డ్రైవ్‌లో 43 వీడియో క్లిప్పింగ్‌లు ఉన్నట్లు డీజీపి తెలిపారు. ఇలాఉండగా చిన్నయానంద తరఫు న్యాయవాది పూజా సింగ్ మీడియాతో మాట్లాడుతూ సిట్ పోలీసులు చిన్నయానంద తరఫు బంధువుల సంతకాలు తీసుకున్నారే తప్ప అరెస్టుకు సంబంధించిన పత్రాలు ఏమీ ఇవ్వలేదని చెప్పారు. ఇలాఉండగా చిన్మయానందను అరెస్టు చేయకపోతే తాను ఆత్మాహత్య చేసుకుంటానని బాధిత విద్యార్థిని పోలీసులను హెచ్చరించారు.